AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG BC Gurukula admissions 2025: బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎంట్రన్స్ టెస్ట్!

తెలంగాణలోని బీసీ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఐఎఫ్ఎస్ తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు..

TG BC Gurukula admissions 2025: బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎంట్రన్స్ టెస్ట్!
BC Gurukula admissions
Sravan Kumar B
| Edited By: Srilakshmi C|

Updated on: May 02, 2025 | 8:38 PM

Share

హైదరాబాద్‌, మే 2: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఐఎఫ్ఎస్ తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు బాలబాలికలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మే 12, 2025వ తేదీతో ముగుస్తాయి. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌లో రెగ్యులర్ గ్రూప్‌లు 5.. MPC, BiPC, MEC,CEC, HECలతో పాటు 7 వృత్తి విద్యా కోర్సులు (ఒకేషనల్ కోర్సు)ల్లోనూ ప్రవేశాలు కల్పిస్తున్నారు. అగ్రికల్చర్ & క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ & యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (MPHW), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు.. ఈ 7 వృత్తి విద్యా కోర్సులు కూడా రెగ్యులర్ కోర్సుతోపాటు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం130 జూనియర్ కాలేజీలలో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.  పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారని, ఎలాంటి రాత పరీక్ష నిర్వహించబోమని ఆయన స్పష్టం చేశారు. బీసీ గురుకులాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అయన అన్నారు. వీరికి గురుకులాల్లో ఆటోమేటిక్ గా సీట్లు కేటాయిస్తామన్నారు. 10వ తరగతి చదివిన గురుకుల స్కూల్‌లలో సంబంధిత ప్రిన్సిపాల్ కు దరఖాస్తు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. బీసీ గురుకులాల్లో కింది రిజర్వేషన్ నియమాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మరిన్ని వివరాలకు 040-23328266 ఫోన్ నంబర్ ను సంప్రదించండి.

బీసీ గురుకులాల్లో రిజర్వేషన్‌ విధానం..

  • BCs – 75% (BC-A 15%, BC-B 25%, BC-C 3%, BC-D 17%, BC-E 10%, MBC 5%)
  • SCs- 15%, STs- 5%, OC/EBC-2%, Orphan- 3%

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో https://mjptbcwreis.telangana.gov.in (లేదా) https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB/ దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..