AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్‎కు కంచుకోటగా ఈ నియోజకవర్గాలు.. లోక్ సభ మెజార్టీలో సరికొత్త రికార్డు..

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపితం అయ్యింది. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండవ భారీ మెజార్టీ 4,67,847 మెజార్టీ సాధించింది. ఇది ఖమ్మం లోక్ సభ చరిత్రలోనే రికార్డు మెజార్టీ అంటున్నారు నేతలు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ప్రతి నియోజకవర్గంలో దానికి మించి మెజార్టీ వచ్చింది. టికెట్ ఎంపిక ,ప్రకటన చివరి క్షణం వరకూ ఉత్కంఠ లేపి అనేక మలుపులు తిరిగినా.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు బట్టి తన వియ్యంకుడికి ఇప్పించారు. అన్నీ తానై వ్యవహరించి అహర్నిశలు శ్రమించి అఖండ విజయంతో సత్తా చాటారు.

కాంగ్రెస్‎కు కంచుకోటగా ఈ నియోజకవర్గాలు.. లోక్ సభ మెజార్టీలో సరికొత్త రికార్డు..
Telangana Congress
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 06, 2024 | 12:36 PM

Share

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపితం అయ్యింది. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండవ భారీ మెజార్టీ 4,67,847 మెజార్టీ సాధించింది. ఇది ఖమ్మం లోక్ సభ చరిత్రలోనే రికార్డు మెజార్టీ అంటున్నారు నేతలు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ప్రతి నియోజకవర్గంలో దానికి మించి మెజార్టీ వచ్చింది. టికెట్ ఎంపిక ,ప్రకటన చివరి క్షణం వరకూ ఉత్కంఠ లేపి అనేక మలుపులు తిరిగినా.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు బట్టి తన వియ్యంకుడికి ఇప్పించారు. అన్నీ తానై వ్యవహరించి అహర్నిశలు శ్రమించి అఖండ విజయంతో సత్తా చాటారు.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మరోసారి నిరూపితం అయ్యింది. రాష్ట్రం మొత్తం ఒక నిర్ణయం తీసుకుంటే.. ఖమ్మం జిల్లా మరో విధంగా విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఎన్నికల్లో జరుగుతూ ఉంటుంది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10కి 9 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తెల్లం వెంకటరావు మూడు నెలలకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‎కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీ వచ్చింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఖమ్మం జిల్లాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు కేబినెట్‎లో కీలక ప్రాధాన్యత కల్పించారు. ఎంపి ఎన్నికల్లో ఖమ్మం సీటు విషయంలో ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యుల టికెట్ రేసులో ఉన్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని డిమాండ్ రావడంతో.. టికెట్ ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానంకు క్లిష్టంగా మారింది. దీంతో చివరకు ఉత్కంఠ రేపింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు బట్టి.. తన వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. నామినేషన్ ఆఖరి రోజు టికెట్ ప్రకటించడంతో పోలింగ్‎కు సమయం 14 రోజులే ఉన్నా ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు, వామ పక్షాలతో సమన్వయం చేసుకుని విజయం సాధించారు. అందరినీ కలుపుకొని విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే ప్రధాన సామాజిక వర్గం నుంచి ఓట్లు పడవు.. కాంగ్రెస్‎లో ఇతర వర్గాలు సహకరించే పరిస్థితి ఉండదనీ.. ఇది తమకు కలిసి వస్తుందని.. తామే గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల ఫలితాలు చూసిన తరవాత కాంగ్రెస్ సునామీ సృష్టించింది. కాంగ్రెస్ నేతలు కూడా ఊహించని భారీ మెజార్టీ 4,67,857తో రికార్డు సాధించారు. ఖమ్మం లోక్ సభ చరిత్రలోనే ఇది రికార్డు మెజార్టీ. సిట్టింగ్ స్థానమైన బీఆర్ఎస్‎ను ఓడించి ఖమ్మం కోటపై కాంగ్రెస్ జెండా ఎగర వేసింది. అందరి అనుమానాలు, ప్రచారాలు పటాపంచలు చేస్తూ.. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీకి మించి మెజార్టీ వచ్చింది. పాలేరు నియోజక వర్గంలో 61,681, ఖమ్మంలో 86,570, మధిరలో 63,470, సత్తుపల్లిలో 69,408, వైరాలో 61,778, కొత్తగూడెంలో 76,177, అశ్వారావుపేటలో 42,927 మెజార్టీ సాధించింది. ఖమ్మం లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాలు కలిపి 2,69,000 వేల మెజార్టీ వస్తే.. ఇపుడు 4,67,847 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. తన పట్టు నిలుపు కోవడమే కాదు. కాంగ్రెస్ భారీగా ఓట్లు సాధించింది. ఖమ్మం లోక్ సభకు ఇన్ ఛార్జ్‎గా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సర్వ శక్తులు ఒడ్డి, అహర్నిశలు శ్రమించి తన సత్తా చాటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..