జనగాం జిల్లాలో ఘనంగా సుభాష్‌చంద్రబోస్ జయంతి వేడుకలు.. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3కే రన్
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 124వ జన్మదిన వేడుకలు దేశ వ్యాప్తంగా అయన అభిమానులు, రాజకీయ, స్వచ్చంద సంఘాలు ఘనంగా జరుపుకుంటున్నారు. జనగాం జిల్లా కేంద్రంలో..
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 124వ జన్మదిన వేడుకలు దేశ వ్యాప్తంగా అయన అభిమానులు, రాజకీయ, స్వచ్చంద సంఘాలు ఘనంగా జరుపుకుంటున్నారు. జనగాం జిల్లా కేంద్రంలో నేతాజీ జయంతి వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు.
జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆద్వర్యంలో అయన చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్స్ అనిత, రాంచందర్ పాల్గొన్నారు. వివిధ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు, వాకర్స్, యోగా సభ్వులు పాల్గొని అయన సేవాలను కొనియాడారు.
నేతాజీ స్ఫూర్తితో యువత దేశంకోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. అనంతరం 3కే రన్ నిర్వహించారు. ఇందులో ఫిట్ ఇండియా సభ్యులు, మహిళలు, యువత ఉల్లాసంగా పాల్గొన్నారు.