తెలంగాణలోకి ఏ పాసులు ఉంటే అనుమ‌తి ఇస్తారు.. న‌ల్ల‌గొండ డిఐజి రంగ‌నాథ్ క్లారిటీ

అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామ‌ని నల్లగొండ డిఐజి రంగనాధ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా...

తెలంగాణలోకి ఏ పాసులు ఉంటే అనుమ‌తి ఇస్తారు.. న‌ల్ల‌గొండ డిఐజి రంగ‌నాథ్ క్లారిటీ
E Pass
Follow us

|

Updated on: May 24, 2021 | 3:23 PM

అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామ‌ని నల్లగొండ డిఐజి రంగనాధ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఏపీ, తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే అనుమతి ఉంటుంద‌న్నారు. అంబులెన్సులకు ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రైవేట్ వాహనాలలో ఆంధ్రా నుండి తెలంగాణకు వచ్చే కోవిడ్, ఇతర రోగులు ఆస్పత్రుల నుండి ఇచ్చిన లెటర్స్, సంబంధిత పత్రాలు ఉంటేనే అనుమతిస్తామ‌ని చెప్పారు. లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ (ఉదయం 6.00 నుండి 10.00 గంటల వరకు) ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు విధిగా ఈ పాస్ కలిగి ఉంటేనే అనుమతిస్తామ‌ని చెప్పారు. ఆంధ్రా నుండి తెలంగాణలోకి వచ్చే వారు పోలీసుల సూచనలు పాటించాలని, ఈ పాస్ లేకుండా వచ్చి సరిహద్దుల వద్ద ఇబ్బందులు పడవద్దని సూచించారు.

ఈ పాస్, ఎలాంటి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలతో బోర్డ‌ర్స్ వ‌ద్ద‌ వాహనాల రద్దీ పెరిగిపోతుందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాస్ పొందలేని వారు సరైన ఆధారాలు చూపించి అత్యవసర వైద్యం కోసం వచ్చినట్లయితే విచారించి అలాంటి వాహనాలను మానవతా దృక్పథంతో అనుమతిస్తామ‌ని చెప్పారు.

లాక్ డౌన్ పరిశీలించిన డిఐజి రంగనాధ్….

నల్లగొండ పట్టణంలో పలు ప్రాంతాలలో లాక్ డౌన్ అమలును స్వయంగా తిరుగుతూ పరిశీలించారు డిఐజి రంగనాధ్. ప‌లు కాలనీలలో తెరిచి ఉంచిన షాపులపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఒక ప్రాంతంలో మద్యం విక్రయాలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

Also Read: దేశంలో ఎల్లో ఫంగస్ వ్యాప్తి..​ యూపీ​లో తొలి కేసు నమోదు.. ల‌క్ష‌ణాలు ఇవి

ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదలపై కొనసాగుతున్న టెన్షన్.. నాలుగు రోజుల తర్వాతే బయటకు..!

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!