MP RRR Bail: ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదలపై కొనసాగుతున్న టెన్షన్.. నాలుగు రోజుల తర్వాతే బయటకు..!
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది. ఆయన బెయిల్ మంజూరైనా... ఇంకా ఉత్కంఠ వీడలేదు. రఘురామ డిశ్చార్జీకి మూడు నుంచి నాలుగు రోజుల సమయం.
MP Raghu Ramakrishna Raju Bail నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది. ఆయన బెయిల్ మంజూరైనా… ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఈరోజు సీఐడీ కోర్టులో జరిగిన వాదనల ప్రకారం ఆయన విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈరోజు సీఐడీ కోర్టులో షూరిటీని ప్రొడ్యూస్ చేశారు రఘురామకృష్ణరాజు తరఫు లాయర్లు. ఈ సందర్భంగా.. రఘురామ డిశ్చార్జ్ రిపోర్టు సబ్‌మిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. రఘురామ డిశ్చార్జీకి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని ఆర్మీ ఆస్పత్రి తెలపడంతో.. అదే విషయాన్ని కోర్టుకు తెలిపారు లాయర్లు. దీంతో బెయిల్ విచారణ వాయిదా పడింది.
రఘురామ విడుదల మరింత ఆలస్యం అవుతుందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం రఘురామ ఫిట్‌గా ఉన్నపుడే విడుదల ఉంటుందన్నారు. దీంతో మరో మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామన్నారు. డిశ్చార్జ్ సమ్మరి కావాలని న్యాయమూర్తి అడిగారని, అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు. నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటిషన్ వేస్తామని ఆయన అన్నారు. అప్పటి వరకు బెయిల్‌పై విడుదల వీలుకాదని లక్ష్మీనారాయణ అన్నారు.
Read Also… Fraud: మాయలేడీ.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువతి.. లబోదిబోమంటున్న యువకుడు