Fraud: మాయలేడీ.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువతి.. లబోదిబోమంటున్న యువకుడు

Matrimonial Fraud: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఆ యువకుడిని చూసింది. ఆ తర్వాత మాటలు కలిపింది. దాదాపు ఏడాది పాటు చాటింగ్ చేసింది. ఇలా మాట్లాడుతూ.. ఆ యువకుడి నుంచి

Fraud: మాయలేడీ.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువతి.. లబోదిబోమంటున్న యువకుడు
woman Cheating
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2021 | 1:55 PM

Matrimonial Fraud: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఆ యువకుడిని చూసింది. ఆ తర్వాత మాటలు కలిపింది. దాదాపు ఏడాది పాటు చాటింగ్ చేసింది. ఇలా మాట్లాడుతూ.. ఆ యువకుడి నుంచి లక్ష రూపాయలు కాజేసింది యువతి. ఈ సంఘటనతో నివ్వెరపోయిన ఆ యువకుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ మెట్లక్కాడు. వివరాలు.. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో తన ప్రోఫైల్‌ను మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లో నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రోఫైల్ చూసి విజయనగరానికి చెందిన యువతి 9 నెలల క్రితం అతడిని సంప్రదించింది. పెళ్లి చేసుకోటానికి తనకేం అభ్యంతరం లేదంటూ చెపుతూ ఆ యువకుడితో మాటలు కలిపింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడంతోపాటు చాటింగ్‌లు సైతం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఆ యువతి వాళ్ల అమ్మతో కూడా మాట్లాడించి.. పెళ్లి ఒప్పందం కుదుర్చుకుంది. అలా కొన్ని రోజుల అనంతరం తన అమ్మకు ఒంట్లో బాగోలేదని.. ఆసుపత్రిలో చూపించాలని యువకుడికి మాయమాటలు చెప్పింది. డబ్బులు కావాలి అర్జెంట్ అంటూ యువకుడి వద్దనుంచి పలుమార్లు డబ్బులు తీసుకుంది. ఓ సారి 30 వేలు, మరోసారి 20 వేలు ఇలా మొత్తం రూ. 1.08 లక్షలను ఆ యువకుడి నుంచి తీసుకుంది.

పెళ్లి ఎప్పడు చేసుకుందామంటూ ఆ యువకుడు అడుగుతుంటే ఇంతకాలం దాటవేస్తూ వచ్చింది. ఇక లాభం లేదనుకున్న ఆ యువకు పెళ్లి విషయంపై ఆ యువతిని గట్టిగా నిలదీయటంతో తల్లి, కూతుళ్లు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. దీంతో ఆ యువకుడు ఆదివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిందంతా పోలీసులకు చెప్పాడు. యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:

Covid-19 vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వద్దు మహాప్రభో.. నదిలోకి దూకి పారిపోయిన గ్రామస్థులు.. ఎక్కడంటే..?

తృణమూల్ కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్, కలకత్తా హైకోర్టు విచారణకు బ్రేక్