AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తృణమూల్ కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్, కలకత్తా హైకోర్టు విచారణకు బ్రేక్

నారదా ముడుపుల కేసులో నలుగురు తృణమూల్ కాంగ్రెస్ నేతలకు గృహ నిర్బంధం విధించాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టుకెక్కింది.

తృణమూల్ కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్, కలకత్తా హైకోర్టు విచారణకు బ్రేక్
Supreme Court Of India
Umakanth Rao
| Edited By: |

Updated on: May 24, 2021 | 1:17 PM

Share

నారదా ముడుపుల కేసులో నలుగురు తృణమూల్ కాంగ్రెస్ నేతలకు గృహ నిర్బంధం విధించాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టుకెక్కింది. నిజానికి ఈ కేసుపై 5 గురు జడ్జీలతో కూడిన కలకత్తా హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఉదయం విచారణ జరపాల్సి ఉంది. కానీ ఆ విచారణ రద్దయింది. మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్ర, పార్టీ మాజీ నేత సోవన్ ఛటర్జీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కోర్టు ఈ నెల 22 న వేర్వేరు అభిప్రాయాలతో కూడిన తీర్పును ప్రకటించింది. అయిదుగురు జడ్జీలతో కూడిన విస్తృత ధర్మాసననానికి దీన్ని నివేదించాలని సూచిస్తూ వీరిని హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ వీరిని గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించగా.. దానితో జస్టిస్ అరిజిత్ బెనర్జీ విభేదిస్తూ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఉత్తర్వులిచ్చారు. చివరకు గృహ నిర్బంధంలో ఉంచాలన్న తీర్పే ఫైనల్ అయింది. ప్రస్తుతానికి ఈ నలుగురిని హౌస్ అరెస్ట్ చేయడమే ఉత్తమమని అరిజిత్ బెనర్జీ నేతృత్వం లోని బెంచ్ అభిప్రాయ పడింది.

కానీ దీనిపై స్టే ఇవ్వాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. కాగా 5 గురు న్యాయమూర్తులతో కూడిన కలకత్తా హైకోర్టు విస్తృత ధర్మాసనం మధ్యలోనే ఎందుకు విచారణను విరమించుకుందో తెలియడంలేదని అంటున్నారు. ఈ ఉదయం ఈ బెంచ్ హాజరు కావలసి ఉన్నప్పటికీ అలా జరగలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: BLACK FUNGAS: బ్లాక్ ఫంగస్‌కు కారణం స్టెరాయిడ్స్, డయాబెటీస్ కాదట.. ఇంకేదో వుందంటున్న ఇండోర్ ప్రొఫెసర్

Good News: త్వరలో కరోనాకు మరో కొత్త వ్యాక్సిన్‌… ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్‌