Yellow Fungus: దేశంలో ఎల్లో ఫంగస్ వ్యాప్తి.. యూపీలో తొలి కేసు నమోదు.. లక్షణాలు ఇవి
కరోనా మహమ్మారితో పోరాటం చేసి గెలిచినవారిని.. ఇప్పుడు ఫంగస్ లు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బ్లాక్, వైట్ ఫంగస్‌లు కరోనా విజేతలపై...
కరోనా మహమ్మారితో పోరాటం చేసి గెలిచినవారిని.. ఇప్పుడు ఫంగస్ లు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బ్లాక్, వైట్ ఫంగస్‌లు కరోనా విజేతలపై విరుచుకుపడుతున్నాయి. దేశంలో బ్లాక్, వైట్ ఫంగస్‌లు క్రమంగా విస్తరిస్తున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలిసారిగా ఎల్లో ఫంగస్ కేసు నమోదైంది. దేశంలో ఇదే మొట్టమొదటి ఎల్లో ఫంగస్ కేసు. సంజయ్ నగర్‌కు చెందిన 45ఏళ్ల వ్యక్తి శరీరంలో ఈ ఫంగస్‌ను గుర్తించారు హర్ష ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్. బీపీ త్యాగి. ఇతర ఫంగస్ల కంటే ఈ వ్యాధి ప్రమాదకరమైనదని తెలిపారు.
ఈ ఫంగస్ యొక్క లక్షణాలు ఏమిటి?
1. శారీరక అలసట ఉంటుంది. 2. బరువు తగ్గడం, నీరసం, స్థిరమైన అలసట ఉంటుంది. 3. ఆకలిని తక్కువగా ఉంటుంది లేదా అస్సలు ఆకలి కాదు 4. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే శరీరంలోని వివిధ భాగాల నుంచి చీము బయటకు వస్తుంది. 5. ఎటువంటి గాయమైనా త్వరగా నయం కాదు.
పసుపు ఫంగస్ శరీరానికి హాని కలిగిస్తుందా?
1. పసుపు ఫంగస్ కళ్లపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. తీవ్రత అధికంగా ఉంటే చూపు కోల్పోవచ్చు 2. వివిధ అవయవాలు పనిచేయడం ఆగిపోయి.. వికలాంగులు అవ్వొచ్చు 3. ఈ వైరస్ శరీరంలోని ఏ భాగానైనా డ్యామేజ్ కలిగిస్తుంది.
పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ ఫంగస్ శరీరంలో గూడు కట్టుకుంటుందని నిపుణులు అంటున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, పసుపు ఫంగస్ మరణాల రేటు చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది శరీరం లోపలి భాగంలో ఎక్కువ గాయాలను కలిగిస్తుంది. అందువల్ల, మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Also Read: ఏపీలో కొత్తగా 12,994 పాజిటివ్ కేసులు.. మరణాలు, పాజిటివ్ కేసుల వివరాలు