CBSE 12th Class Exams: మల్టీపుల్ ఛాయిస్ విధానంలో సీబీఎస్ఈ పరీక్షలు.? ఈ తేదీల్లో నిర్వహించే అవకాశాలు..
CBSE 12th Class Exams: కరోనా కారణంగా వాయిదా పడ్డ సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యా శాఖ కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్రం వర్చువల్ మీటింగ్...
CBSE 12th Class Exams: కరోనా కారణంగా వాయిదా పడ్డ సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యా శాఖ కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్రం వర్చువల్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరీక్షల నిర్వహణపై ఓ సూచన అందరి దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. ఈ సూచన మేరకు ఏ స్కూళ్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ కేంద్రాల్లోనే పరీక్షలను నిర్వహించి.. కేవలం 90 నిమిషాల్లో మల్టిపుల్ ఛాయిస్, షార్ట్ క్వశ్చన్స్ విధానంలో పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. దీనికి చాలా రాష్ట్రాలు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పరీక్షలు నిర్వహిస్తే.. జులై 15, ఆగస్టు 26 మధ్య చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను జూన్ 1న అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. పూర్తిగా కరోనా నిబంధనలను పాటిస్తూ.. రెండు దశల్లో పరీక్షలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. దేశంలో పెరుగుతోన్న కరోనా నేథ్యంలో పరీక్షలను రద్దు చేయాలంటూ ఇప్పటికే తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్రధానికి లేఖలు రాసిన విషయ తెలిసిందే.