Telangana Open School: తెలంగాణ ఓపెన్ స్కూల్ ఫీజు చెల్లింపు చివరి తేదీ పొడగింపు.. ఎప్పటి వరకంటే..
Telangana Open School Society: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తగరతి, ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇప్పటికే నోటిషికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరుకావాలనుకుంటున్న వారు ఫీజు...
Telangana Open School Society: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తగరతి, ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇప్పటికే నోటిషికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరుకావాలనుకుంటున్న వారు ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జూలైలో నిర్వహించదలచిన ఈ పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఈరోజు (సోమవారం)తో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫీజు చెల్లింపు చివరి తేదీని మరోసారి పెంచారు. వాస్తవానికి రూ. 50 అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపునకు ఈరోజే చివరి తేదీ ఉండగా.. తాజాగా ఈ తేదీని 31-05-2021 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఓపెన్‌స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును ఏప్రిల్ 19 నుంచి అపరాధ రుసుము లేకుండా మే 10 వరకు. రూ.25 అపరాధ రుసుముతో మే 17 వరకు, రూ.50 అపరాధ రుసుముతో మే 24 వరకు ఫీజు చెల్లించవచ్చని గతంలో తెలిపారు. అయితే తాజాగా ఈ తేదీని నెలాఖరుకు పొడగించారు.
ఈ సారైనా పరీక్షలు నిర్వహిస్తారా.?
ఇదిలా ఉంటే గతేడాది కరోనా కారణంగా పరీక్షలను రద్దుచేసి అందరినీ 35 శాతం మార్కులతో పాస్ చేశారు. మరి ఈసారి కూడా కరోనా విజృంభణ కొనసాగుతోన్న నేపథ్యంలోనే ఈసారైనా పరీక్షలు నిర్వహిస్తారో లేదో చూడాలి. ఇక ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీఎస్ ఆన్‌లైన్, మీసేవ కేంద్రాలు, డెబిట్, క్రెడిట్‌కార్డుల ద్వారా ఫీజు చెల్లించాలి.
Also Read: ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని.. ఉచిత వైద్యం అందించండి..! ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ..!
Vakeelsaab Fight Scene: చెలరేగిన నెల్లూరు కుర్రాళ్లు.. ‘వకీల్‌సాబ్’ ఫైట్ సీన్‌ను యాజిటీజ్ దించేశారు