Vakeelsaab Fight Scene: చెలరేగిన నెల్లూరు కుర్రాళ్లు.. ‘వకీల్‌సాబ్’ ఫైట్ సీన్‌ను యాజిటీజ్ దించేశారు
రాజకీయాల్లోకి వెళ్లి.. కాస్త గ్యాప్ తీసుకుని 'వకీల్‌సాబ్' చిత్రంతో తిరిగి చిత్ర పరిశ్రమకు రీ-ఎంట్రీ ఇచ్చారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఈ చిత్రం పవన్ అభిమానులను ఓ రేంజ్‌లో అలరించింది.
రాజకీయాల్లోకి వెళ్లి.. కాస్త గ్యాప్ తీసుకుని ‘వకీల్‌సాబ్’ చిత్రంతో తిరిగి చిత్ర పరిశ్రమకు రీ-ఎంట్రీ ఇచ్చారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఈ చిత్రం పవన్ అభిమానులను ఓ రేంజ్‌లో అలరించింది. సాధారణ ప్రేక్షకులు సైతం పవన్ యాక్టింగ్ చూసి మెస్మరైజ్ అయ్యారు. పవన్‌ని స్క్రీన్‌పై ఏవిధంగా చూడాలని ఓ అభిమాని కోరుకుంటాడో అంతే పవర్‌ఫుల్‌గా చూపించారు దర్శకుడు వేణు శ్రీరామ్. సినిమాలోని విజువల్స్‌తోపాటు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరహో అనిపించింది. కాగా, తాజాగా ‘వకీల్‌సాబ్’ సినిమాలోని ఓ ఫైట్ సీక్వెన్స్‌ని రీక్రియేట్ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో రూపొందించారు. సినిమాలో చూపించిన దానికి ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్ సీన్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా షూట్ చేశారు. ఈ వీడియోని పవర్‌స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్‌తో పాటు పలువురు నెటిజన్లు.. ‘కుర్రాళ్లు ఇరగదీశారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కుర్రాళ్లు గతంలో కూడా పలు సినిమాల్లోని యాక్షన్ సీన్లను అద్భుతంగా రీ క్రియేట్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.
నెల్లూరి కుర్రాళ్ల ఫైట్ దిగువన చూడండి…
#SuperKids: Recieved in #WhatsApp. can’t wait to share it with you all. #NelloreKurollu back with another fight scene from #VakeelSaab. Encourage #LocalTalent. Share it with your friends. pic.twitter.com/pwzKyozOjf
— Phanindra Papasani (@PhanindraP_TNIE) May 24, 2021
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ‘వకీల్‌సాబ్’తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నివేధా థామస్, అంజలి, అనన్యా పాండే కీలకపాత్రలు పోషించారు. ప్రకాశ్‌రాజ్ నంద పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా రికార్డు రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టింది.
Also Read: తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి గుడ్ న్యూస్.. ఖాతాలలోకి నేరుగా డబ్బు జమ