Payal Rajput : మరోసారి ఐటెమ్ సాంగ్స్ చేసే ప్రసక్తే లేదు అంటున్న అందాల పాయల్..
ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు.. మరో వైపు నటనతోనూ ఆకట్టుకుంటుంది పాయల్ రాజ్ పుత్.
Updated on: May 24, 2021 | 5:05 PM

ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు.. మరో వైపు నటనతోనూ ఆకట్టుకుంటుంది పాయల్ రాజ్ పుత్.

తన నటన, అంద చందాలతో యువతను పిచ్చెక్కిస్తోంది ఈ కుర్రది. ఫలితంగా ఓవర్ నైట్ లోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది.

ఆర్ఎక్స్100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్.. అందాల ప్రదర్శకు ఏమాత్రం మొహమాటపడకుండా నటించి ఆకట్టుకుంది.

ఆతర్వాత వెంకటేష్ సరసన వెంకీమామ సినిమా నటించి ఆకట్టుకుంది. అలాగే రవితేజ నటించిన డిస్కోరాజా సినిమాలో కనిపించి కవ్వించింది పాయల్

అయితే ఈ బ్యూటీ ఆమధ్య బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన సినిమాలో ఐటెమ్ సాంగ్ లో నటించి అలరించింది.

ఇప్పుడు మరోసారి తాను ఐటమ్ నంబర్ లో నర్తిస్తోందంటూ ప్రచారం సాగుతుంటే అది తట్టుకోలేక వెంటనే అసలు `నేను ఏ ఐటెమ్ నంబర్ చేయడం లేదు!` అని క్లారిటీ ఇచ్చింది పాయల్ పాప.




