AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madras IIT: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై మద్రాస్ ఐఐటీ ఉచిత ఆన్‌లైన్ కోర్సు..ఎలా దరఖాస్తు చేసుకోవాలి..పూర్తి వివరాలు

Madras IIT: మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఉచిత ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించబోతోంది.

Madras IIT: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై మద్రాస్ ఐఐటీ ఉచిత ఆన్‌లైన్ కోర్సు..ఎలా దరఖాస్తు చేసుకోవాలి..పూర్తి వివరాలు
Madras IIT
KVD Varma
|

Updated on: May 24, 2021 | 4:29 PM

Share

Madras IIT: మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఉచిత ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించబోతోంది. నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ సహాయంతో ఈ కోర్సు అందిస్తున్నారు. ఈ కోర్సు చేయాలనుకునే అభ్యర్థులు ఐఐటి మద్రాస్ (iitm.ac.in) అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా ఎన్‌పిటిఎల్ (NPTEL) అధికారిక వెబ్‌సైట్ nptel.ac.in ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.

12 వారాల కోర్సు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఈ కోర్సు 12 వారాలు ఉంటుంది. దీనిలో సమస్య పరిష్కారం కోసం శోధన పద్ధతి బోధిస్తారు. ఐఐటి మద్రాసు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ దీపక్ ఖేమనీ ఈ కోర్సును విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. ఈ కోర్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలాగే డేటా సైన్స్ యుజి, పిజి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

జూలై 26 నుండి కోర్సు ప్రారంభం..

ఈ కోర్సు జూలై 26 నుండి అక్టోబర్ 15 వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 2 లోగా ఎన్‌పిటిఎల్ వెబ్‌సైట్ ద్వారా ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ అనుకూలాంశం ఏమిటంటే, ఈ కోర్సు కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 23 న పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు హాజరు కావడానికి మాత్రం అభ్యర్థులు 1000 రూపాయల రుసుము చెల్లించాలి. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ కోర్సు సర్టిఫికేట్ కూడా లభిస్తుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

  • మొదట, ఐఐటి మద్రాస్ మరియు ఎన్‌పిటిఎల్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
  • అక్కడ అడిగిన సమాచారాన్ని నమోదు చేయండి.
  • దరఖాస్తు ఫారమ్ నింపిన తర్వాత సమర్పించండి.

Also Read: South Central Railway Jobs: సౌత్ సెంట్ర‌ల్ రైల్వే హైద‌రాబాద్ డివిజ‌న్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

Yaas Cyclone Effect: ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం.. రాగల మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?