AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horse Funeral: గుర్రం అంత్యక్రియలకు వందలాది మంది హాజరు.. గ్రామం సీజ్.. వీడియో వైరల్..

Horse funeral karnataka - Watch Video: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో సొంత కుటుంబ స‌భ్యులు చనిపోతేనే చివరి చూపు చూసేందుకు, అంత్యక్రియ‌ల‌  కోసం

Horse Funeral: గుర్రం అంత్యక్రియలకు వందలాది మంది హాజరు.. గ్రామం సీజ్.. వీడియో వైరల్..
Horse Funeral
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2021 | 2:30 PM

Share

Horse funeral karnataka – Watch Video: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో సొంత కుటుంబ స‌భ్యులు చనిపోతేనే చివరి చూపు చూసేందుకు, అంత్యక్రియ‌ల‌  కోసం రావడం లేదు. ఒకవేళ వచ్చినా.. తాజా నిబంధనల మేరకు 20-30 మందితోనే అంత్యక్రియలు పూర్తిచేయాలని ప్రభుత్వాలు కఠిన మార్గదర్శకాలు జారీచేశాయి. అలాంటిది ఓ గుర్రం చ‌నిపోతే వంద‌లాది మంది క‌లిసి క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా.. అంత్య‌క్రియ‌లు నిర్వహించారు. ఈ సంఘటన క‌ర్ణాట‌క‌లోని బెలగావిలోని మ‌రాదిమ‌త్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మరాదిమత్ గ్రామంలో ఆదివారం స్థానిక మత సంస్థకు చెందిన గుర్రం చనిపోయింది. అయితే ఆ గుర్రం అంత్యక్రియల్లో వేలాది మంది కోవిడ్ నిబంధనలు పాటించకుండా హాజరై దహనసంస్కారాలు నిర్వహించారు.

కాగా.. ఈ సంఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామానికి సీలు వేసి పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోకి ఎవ్వరినీ రానీయడం లేదు.. గ్రామం నుంచి వెళ్లనివ్వడం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఆంక్షలు 14 రోజుల పాటు అమల్లో ఉంటాయని బెలగావి ఎస్పీ లక్ష్మణ్ నింబార్గి తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ ఘ‌ట‌న‌పై క‌ర్ణాట‌క హోంమంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మాయి స్పందించారు. జిల్లా అధికారులు ఈ విష‌యంపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నార‌ని, నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్లడించారు.

వీడియో..

మ‌రాదిమత్ ప్రాంతంలోని సిద్ధేశ్వ‌ర మ‌ఠానికి చెందిన గుర్రాన్ని దేవ‌తా అశ్వంగా గ్రామ‌స్థులు భావిస్తారు. ఈ నేప‌థ్యంలోనే దాని అంత్య‌క్రియ‌ల‌కు పెద్ద ఎత్తున స్థానికులు త‌ర‌లివ‌చ్చి పాల్గొన్నారని పలువురు పేర్కొన్నారు. అయితే లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు పాటించకుండా పెద్ద ఎత్తున పాల్గొనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Fraud: మాయలేడీ.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువతి.. లబోదిబోమంటున్న యువకుడు

Corona in UK: యూకేలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఇంగ్లాండ్ నుంచి వచ్చేవారిని అనుమతించని జర్మనీ..

Follow Us
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్