వీల్‌చైర్ క్రికెట్‌లో రాణిస్తున్న దివ్యాంగుడు.. తండా నుంచి జాతీయస్థాయికి ఎదిగిన తెలంగాణ యువకుడు.. 

Nalgonda District News: ‘కృషి ఉంటే మనుషులు ఋషులు అవవుతారు’ అన్నారు పెద్దలు. పట్టుదల, సాధన చేస్తే సాధించలేని అంటూ ఏమి లేదు. ఇదే విధమైన సంకల్ప బలంతో తెలంగాణకు చెందిన ఓ యువకుడు తనలోని లోపాన్నే ఆయుధంగా మార్చుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అతని సంకల్ప బలం ముందు అతనిలోని అంగ వైకల్యం కూడా ఓడిపోయింది. ఇంతకీ ఎవరీ దివ్యాంగుడు..? క్రికెటర్‌గా ఎలా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వీల్‌చైర్ క్రికెట్‌లో రాణిస్తున్న దివ్యాంగుడు.. తండా నుంచి జాతీయస్థాయికి ఎదిగిన తెలంగాణ యువకుడు.. 
Dharavath Suresh
Follow us
M Revan Reddy

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 16, 2023 | 9:20 AM

నల్గొండ జిల్లా, సెప్టెంబర్ 16: నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగుండ్లకు చెందిన బాలు, మల్లి దంపతులకు ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. బాలు కుటుంబానికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అంతలోనే ముగ్గురు కొడుకుల్లో చిన్న కొడుకు ధరావత్ సురేష్‌కు 8 ఏళ్ళ వయసులో పోలియో వ్యాధి సోకి దివ్యాంగుడిగా మారాడు. అయితే సురేష్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే మహా ఇష్టం. డిగ్రీ పూర్తి చేసిన సురేష్.. చేతికర్ర సహాయంతో క్రికెట్ ఆడేవాడు. ఇలా క్రికెట్ ఆడుతూ వీల్ చైర్‌ ప్లేయర్‌గా మారాడు. తొలుత వీల్ చైర్ క్రికెటర్‌గా పలు జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. 2020లో రాజస్థాన్‌లో నిర్వహించిన వీల్ చైర్ క్రికెట్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ పోటీల్లో బెస్ట్ ఫీల్డర్ అవార్డును కూడా సాధించాడు సురేష్. 2022లో ఢిల్లీలో జరిగిన ఇండియన్ వీల్ చైర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో సురేష్ పాల్గొన్నాడు. ఈ లీగ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ గా, ఫీల్డర్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సురేష్ ప్రతిభను గుర్తించిన సెలెక్టరులు వీల్ చైర్ క్రికెట్ జట్టుకు ఎంపిక చేశారు.

నేపాల్ రాజధాని ఖాట్మండ్ వేదికగా అక్టోబర్ 6 నుంచి 11వ తేదీ వరకు వీల్ చైర్ క్రికెట్ ఆసియా కప్ జరగనుంది. ఆసియా కప్ లో పాల్గొనే భారత దివ్యాంగుల వీల్ చైర్ క్రికెట్ జట్టుకు సురేష్ ను దివ్వాంగ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది.

కాగా, ఈ పోటీలో పాల్గొనేందుకు అక్టోబర్ ఒకటో తేదీన సురేష్ నేపాల్ కు వెళ్లాల్సి ఉంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు దివ్వాంగ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు 25 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీంతో నేపాల్ వెళ్లేందుకు సురేష్ దాతల సహాయాన్ని కోరుతున్నాడు. మరోవైపు నేపాల్ లో జరిగే వీల్ చైర్ క్రికెట్ లో తమ తండాకు చెందిన సురేష్ పాల్గొనడం పట్ల తండావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..