AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అమానుషం.. లక్షన్నరకు ఆడబిడ్డ విక్రయం.. మూడు నెలల తర్వాత ఏం జరిగిందంటే..?

ఆధునిక యుగంలో ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశు విక్రయాల గతంలో అనేక ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నవ మాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పసి బిడ్డ విక్రయం ఘటన అంగన్వాడీ టీచర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

Telangana: అమానుషం.. లక్షన్నరకు ఆడబిడ్డ విక్రయం.. మూడు నెలల తర్వాత ఏం జరిగిందంటే..?
Child
M Revan Reddy
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jan 13, 2024 | 11:27 AM

Share

ఆధునిక యుగంలో ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశు విక్రయాల గతంలో అనేక ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నవ మాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పసి బిడ్డ విక్రయం ఘటన అంగన్వాడీ టీచర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం రంగండ్ల గ్రామానికి చెందిన ఆంగోతుసేవ- జ్యోతి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జ్యోతి గత ఏడాది సెప్టెంబర్‌ 16న నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఇప్పటికే పేదరికంలో ఉన్న ఇద్దరు ఆడపిల్లలను సాకే స్తోమత లేదని ఆందోళన చెందారు. పుట్టిన శిశువును అమ్ముతామని ఆదే ఆస్పత్రిలో స్వీపర్‌ గా పనిచేస్తున్న ఈసం వరమ్మకు చెప్పారు. అయితే, నాంపల్లి మండలం పసునూరుకు చెందిన బత్తుల సైదులు- కవిత దంపతులు సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. వీరికి అమ్మేందుకు సిద్దంగా ఉన్న నవజాత శిశువు విషయాన్ని సైదులు దంపతులకు వరమ్మ తెలియజేసింది.

దీంతో వారు సెస్టెంబర్‌ 20న సేవ-జ్యోతి దంపతులకు రూ1.50 లక్షలు ఇచ్చి ఆ శిశువును తీసుకెళ్లారు. మూడు నెలల తర్వాత రంగండ్ల గ్రామానికి జ్యోతి వచ్చింది. కాన్పు తర్వాత పాప కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి అంగన్‌వాడీ టీచర్‌కు చెప్పారు. ఆమె చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారుల దృష్టికితీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సేవ-జ్యోతి దంపతులతోపాటు, ఆడశిశువును కొన్న సైదులు-కవిత దంపతులు, స్వీపర్‌ వరమ్మను హలీయా పోలీసులు అరెస్టు చేశారు. ఆడశిశువును నల్లగొండలోని శిశుగృహకు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..