AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila – Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల.. ఎందుకో తెలుసా..?

ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల చెప్పారు. ఈ సమావేశంలో రాజకీయాలపై చర్చించలేదన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు షర్మిల.

YS Sharmila - Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల.. ఎందుకో తెలుసా..?
Ys Sharmila Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Jan 13, 2024 | 12:43 PM

Share

కాంగ్రెస్ నాయకురాలు వైఎస్‌ షర్మిల తనయుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది. నిశ్చితార్థం వేడుక జనవరి 18న జరగనుంది. ఈ మేరకు వైఎస్ షర్మిల వివాహ సన్నాహాలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవలే తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి హరీష్ రావు, తదితరులను ఇప్పటికే ఆహ్వానించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా వైఎస్ షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన వైఎస్‌ షర్మిల.. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల చెప్పారు. ఈ సమావేశంలో రాజకీయాలపై చర్చించలేదన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు షర్మిల. ఇక కాంగ్రెస్‌ పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా..క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నిర్వహిస్తానన్నారు.. షర్మిల. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం వైఎస్‌ఆర్‌ కల అని చెప్పారు.

ఇదిలాఉంటే.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే, సీటు దక్కని వైసీపీ నేతలు షర్మిల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల చంద్రబాబును కలిసి తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో షర్మిల నారా కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు సైతం తెలిపారు. అంతేకాకుండా.. షర్మిల పలువురు ప్రతిపక్ష నేతలకు కూడా ఆహ్వానించనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది..

వీడియో..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..