Chandrababu: భోగీ రోజు ఏపీలో వినూత్న కార్యక్రమం.. పాల్గొననున్న టీడీపీ, జనసేన అధినేతలు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నామన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల్లేవని విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నామన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల్లేవని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశాయన్నారు. ప్రతి పేద కుటుంబం పండగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నాటి తెలుగుదేశం హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఇచ్చామని గుర్తుచేశారు చంద్రబాబు.
ఈ సంక్రాంతి నుంచి కొత్త క్రాంతి ప్రజల జీవితాల్లో వచ్చేలా మన అడుగులు పడాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అంతా కలుసుకునే సంక్రాంతి పండుగ సమయం కొత్త మార్పుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. సమాజ హితం, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించి సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. మీ, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇది సరైన సమయం. రండి! కదలి రండి! రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేము చేసే పోరాటంలో భాగస్వాములవ్వండన్నారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామని చెబుతూ భోగీ, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.
భోగీ రోజు బాబు, పవన్ ప్రత్యేక కార్యక్రమం..
ఇదిలా ఉంటే జనవరి 14న భోగీ మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను భోగీ మంటల్లో వేసి నిరసన తెలుపనున్నారు. అమరావతి ప్రాంతంలోని రాజధాని గ్రామాల్లో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో భోగీమంటల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




