Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని వెళితే.. డాక్టర్ ఎంత పని చేశాడో.. అసలేం జరిగిందంటే.?

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాడు. బాధితుడిని పరిశీలించిన వైద్యుడు..

Telangana: గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని వెళితే.. డాక్టర్ ఎంత పని చేశాడో.. అసలేం జరిగిందంటే.?
Nagarkurnool Man Died
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 11, 2022 | 8:24 PM

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాడు. బాధితుడిని పరిశీలించిన వైద్యుడు.. స్కానింగ్ చేసి అపెండిక్స్ ఉందని చెప్పాడు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నాడు. దాంతో బాధితుడు ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే, ఆ ఆపరేషన్ కాస్తా వికటించడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, బాధితుడు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌కు చెందిన సుమంత్(28) నగలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా సుమంత్ కడుపుబ్బరంతో బాధపడుతున్నాడు. దాంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద చూయించుకున్నాడు.

ఆ ఆర్ఎంపీ కర్నూలులోని ఎన్ఆర్ పేటలో ఉన్న మెడికేర్ హాస్పిటల్‌ను రిఫర్ చేశాడు. దాంతో సుమంత్ మెడికేర్ ఆస్పత్రికి వెళ్లి చూయించుకున్నాడు. అతన్ని పరీక్షించిన వైద్యుడు.. స్కానింగ్ తీయించాల్సిందిగా సూచించాడు. స్కానింగ్ రిపోర్ట్ పరిశీలించిన వైద్యుడు.. అపెండిక్స్ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరించాడు. దాంతో సుమంత్ సదరు ఆస్పత్రిలోనే ఆపరేషన్ చేయించుకున్నాడు. బుధవారం ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. అదే రోజు రాత్రి అతనికి తీవ్రమైన కడుపునొప్పి, ఆయాసం వచ్చింది. దాంతో వైద్యులు వచ్చి చికిత్స చేసి వెళ్లారు. కాసేపు బాగానే ఉన్న సుమంత్‌కు మళ్లీ అదే సమస్య ఎదురైంది. దాంతో సుమంత్ కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. గురువారం ఉదయం సుమంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని సుమంత్ భారయ లావణ్య ఆరోపించారు. సుమంత్ మృతదేహాన్ని ఆస్పత్రి ముందు వుంచి ఆందోళనకు దిగారు బాధిత కుటుంబ సభ్యులు.

ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆస్పత్రి యాజమాన్యం లాబీయింగ్ చేసినట్లు సమాచారం. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌లో రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సుమంత్‌కు చికిత్స అందించిన ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడం కొసమెరుపు. తాత్కాలిక అనుమతులు కూడా ఆస్పత్రికి లేవని, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ బి రామగిడ్డయ్య చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..