Naga Devata: కొత్తదేవుడు వెలిశాడు..! చెట్టుకింద శివయ్య, పుట్టలో నాగన్న.. స్థానికులు ప్రత్యేక పూజలు..

Naga Devata: కొత్తదేవుడు వెలిశాడు..! చెట్టుకింద శివయ్య, పుట్టలో నాగన్న.. స్థానికులు ప్రత్యేక పూజలు..

Naga Devata: మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే కాలనీలో దేవుడు వెలిశాడు. భారీగా గుమిగూడిన స్థానికులు...

Subhash Goud

|

Apr 20, 2021 | 7:51 PM

Naga Devata: మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే కాలనీలో దేవుడు వెలిశాడు. భారీగా గుమిగూడిన స్థానికులు పూజలు, మొక్కులు తీర్చుకుంటూ జాతర నిర్వహిస్తున్నారు. కొత్తగూడ మండల కేంద్రం లోని జిఎల్ నగర్ కాలనీ శివారులో నాగదేవత, శివుడు వెలిశాడని ప్రచారం జరగడంతో గ్రామస్తులు భారీగా గుమిగూడారు. పసుపు, కుంకుమ, జలం, పుష్పాలతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. నాగదేవత వెలిసిందని తెలుసుకున్న మహిళలు భక్తి పారవశ్యం తో పూజలు చేస్తూ తమ కోర్కెలు తీరాలని వేడుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కుతూ, పూజలు నిర్వహించారు.

మరికొందరైతే బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకాలు చేశారు. సాక్షత్తూ పరమశివుడు, నాగేంద్రుడే స్వయంగా వెలిశారని…స్థానికులు ఘంటా పథంగా చెబుతున్నారు. పూజలు అన్నీ పూర్తయిన తర్వాత ….వెంటనే కాలనీ వాసులు సమావేశమయ్యారు. కొత్తగా వెలిసిన దేవుళ్లకోసం ఏం చేయాలో సమాలోచనలు చేశారు. వెంటనే ఆ ప్రాంతంలో ఓ పెద్దగుడి కట్టించాలని తీర్మానించారు. స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చందాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడ ఓ హుండీ కూడా ఉంచాలని నిర్ణయించారు. త్వరలో మంచిరోజు చూసుకుని అన్ని వసతులతో కూడిన భవ్యమైన గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు కాలనీవాసులు చెప్పారు

Smallest Cow: బుజ్జి ఆవుకు.. బుల్లి దూడ.. తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేస్తున్న చిట్టి దూడ

LIC Paytm: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త… డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu