Coronavirus: కరోనా హాట్‌స్పాట్‌గా మారిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గం… వరుసగా కోవిడ్‌ బారిన పడుతున్న నేతలు

Coronavirus: కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు...

Coronavirus: కరోనా హాట్‌స్పాట్‌గా మారిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గం... వరుసగా కోవిడ్‌ బారిన పడుతున్న నేతలు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 20, 2021 | 6:18 PM

Coronavirus: కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న ఐదు రోజులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారిన పడ్డారు. అయితే ప్రచారంలో పాల్గొన్న 60 మందికి పైగా నేతలకు కరోనా సోకినట్లు వార్తలు వస్తుండటంతో ప్రచారంలో పాల్గొన్న నేతలంతా అప్రమత్తం అయ్యారు. తమకు కూడా కరోనా సోకుతుందేమోనన్న టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ కూడా కరోనా బారిన పడి హోంఐసోలేషన్‌లో ఉన్నారు. అలాగే నోముల భగత్‌ కుటంబ సభ్యులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. అయితే ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బహిరంగ సభలో చాలా మంది వరకు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

ఇతర నాయకులలో..

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోదరుడికి, ఆర్మూర్‌ జడ్పీటీసీకి, ఆర్మూర్‌కు చెందిన మరో నలుగురికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇక టీఆర్‌ఎస్‌ నాయకుడుడు కోటిరెడ్డి, కడారి అంజయ్య, త్రిపురారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జానయ్య, నేతలు గుర్రంపోడు ఇన్‌చార్జీగా వ్యవహరించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డ్రైవర్‌, మరి కొంత మంది నాయకులు కరోనా బారిన పడ్డారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, ఆయన భార్య నివేదితారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డ్రైవర్, గన్‌మెన్లకు కూడా కరోనా బారిన పడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌లకు కూడా కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎవరూ కూడా మాస్కులు ధరించకపోవడం వల్లే కరోనా బారిన పడినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.

కాగా, ఏప్రిల్‌ 13 నుంచి గత వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,741 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క నల్గొండ జిల్లాలో 795 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా నిర్ధారణ అయిన సోమవారం నాడు నల్గొండ జిల్లాలో 144 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 66 కేసులు హాలియా ప్రాంతం నుంచి వచ్చినవే. అయితే జిల్లాలో వాస్తవ కేసులు ఇంతకు రెండురెట్లు ఎక్కవే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవీ చదవండి: Covid19: కరోనా సెకండ్ వేవ్‌కు ఈ వైరస్సే కారణమా..?.. ప్రభుత్వం చెబుతున్నదేంటి..? పరిశోధకులు చెబుతున్నదేంటి..?

కరోనా భయాలు – వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు, కర్ఫ్యూ, లాక్‌డౌన్‌.. ఏయే రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు ఉన్నాయంటే..!

CM Wife Corona Positive: ముఖ్యమంత్రి భార్యకు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ముఖ్యమంత్రి..