Covid19: కరోనా సెకండ్ వేవ్‌కు ఈ వైరస్సే కారణమా..?.. ప్రభుత్వం చెబుతున్నదేంటి..? పరిశోధకులు చెబుతున్నదేంటి..?

Double Mutant Variant: భారత్‌లో కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. గత రెండు వారాల్లో ఏకంగా 25 లక్షల కొత్త కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. ఏప్రిల్‌ 4 నుంచి దేశంలో తొలిసారిగా..

Covid19: కరోనా సెకండ్ వేవ్‌కు ఈ వైరస్సే కారణమా..?.. ప్రభుత్వం చెబుతున్నదేంటి..? పరిశోధకులు చెబుతున్నదేంటి..?
Corona Pandemic
Follow us
Subhash Goud

|

Updated on: Apr 20, 2021 | 2:33 PM

Double Mutant Variant: భారత్‌లో కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. గత రెండు వారాల్లో ఏకంగా 25 లక్షల కొత్త కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. ఏప్రిల్‌ 4 నుంచి దేశంలో తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ దాటింది. నాటి నుంచి నేటి వరకు దాదాపు ప్రతి రోజు లక్షకుపైగా కేసులు నమోదు అవుతుండగా, గత నాలుగైదు రోజుల నుంచి రోజు వారీగా కొత్త కేసులు 2 లక్షలకుపైగానే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్క రోజే ఏకంగా 2.75 లక్షల కేసులు నమోదు కాగా, మంగళవారం 2,59,170 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌కు గల కారణాలు ఏంటన్నది ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఏడాదిగా కరోనా నిబంధనలు పాటిస్తున్న ప్రజల్లో క్రమంగా నిర్లక్ష్యం పెరిగి ప్రస్తుత స్థితికి దారి తీసిందని ప్రభుత్వ వాదిస్తుంగా, కొంత మంది నిపుణులు మాత్రం కరోనా డబుల్‌ మ్యూటెంటే కేసులు విపరీతంగా పెరగడానికి కారణమని చెబుతున్నారు.

అసలు ఏమిటీ ఈ డబుల్ మ్యూటెంట్…

వైరల్‌ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్న సమయంలో దీనికి కారణమైన వైరస్‌లు జన్యుపరమైన మార్పులకు లోనవుతాయి. ఇలా మార్పు చెందిన వైరస్‌ కొన్ని సందర్భాలలో కొత్త లక్షణాలు సంతరించుకుని ఓ క కొత్త వేరియంట్‌గా మారుతుంది. కాగా, మహారాష్ట్రలో అధికారులు జనవరిలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ను గుర్తించారు.

బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, అమెరికా వేరియంట్లకు, ఈ వైరస్‌కు మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మూడు వైరస్‌లలో పోలికలున్న తాజాగా వేరియంట్‌లో ఒకేసారి రెండు జన్యుమార్పులు (మ్యూటేషన్లు) చోటు చేసుకుంటున్నాయి. శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను బి.1.617 అని పిలుస్తున్నారు.

డబుల్‌ మ్యూటెంట్‌తో ఎక్కువ ప్రమాదమా..?

అయితే కరోనా వైరస్‌ శరీరంలోని కణాల్లోకి ప్రవేశించాలంటే స్పైక్‌ ప్రోటీన్‌ అత్యంత కీలకం. బీ.1.617లోని రెండు మ్యూటెషన్లు ఈ స్పైక్ ప్రోటీన్‌లో కొన్ని మార్పులు తెచ్చాయి. దీని కారణంగా డబుల్ మ్యూటెంట్‌. రోగనిరోధక వ్యవస్థలోని యాంటీబాడీలకు చిక్కకుండా మరింత వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం సంతరించుకుంది. ఈ మార్పుల వల్ల వ్యాధి తీవ్రత పెరిగిందా లేక కేసుల సంఖ్య పెరిగిందా అనేది స్పష్టంగా నిరూపించగలిగే గణాంకాలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు.

ఈ అంశంపై కూడా పరిశోధకుల్లో పూర్తి స్పష్టత లేదు. వైరస్‌ల జన్యుక్రమాన్ని కనుక్కోవడంలో భారత్‌ ఐరోపా దేశాలతో పోలిస్తే వెనుకబడే ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో 361 వైరస్ శాంపిళ్ల జన్యుక్రమాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి తెలుసుకోవడంతో మహారాష్ట్రలో ఇటీవల కాలంలో నమోదైన కేసుల్లో 60 శాతం ఈ వైరస్ వల్లేనని బట్టబలయలైంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి వివిధ ప్రాంతాల ప్రజలు నిత్యం భారీగా రాకపోకలు సాగిస్తుంటారు. కాబట్టి మహారాష్ట్రలోని డబుల్ మ్యూటెంట్ ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు 10 రాష్ట్రాల్లో ఈ డబుల్ మ్యూటెంట్ కారణంగా కేసులు పెరిగాయనేది ప్రస్తుతమున్న వాదన.

సెకండ్‌ వేవ్‌కు ఈ వైరస్‌యే కారణమా…?

ప్రస్తుతం పరిస్థితికి డబుల్‌ మ్యూటెంట్‌ కారణమనే వాదన వైపే నిపుణులు మొగ్గు చూపుతున్నారు. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యల్లో శాంపిళ్లను సేకరించి వైరస్ కణాల జన్యుక్రమాన్ని నిర్ధారించాకే తుది నిర్ణయానికి రావాలని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తికి సంబంధించి గణాంకాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో సెకండ్‌వేవ్‌ కారణం ఏమిటన్నది స్పష్టంగా చెప్పలేమని నిపుణులు అంటున్నారు.

అయితే దీనిపై నిపుణులు రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యకాంటీబాడీల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్న డబుల్‌ మ్యూటెంట్‌పై టీకా ప్రభావం కొంత తక్కువగా ఉంటుందనేది కొందరి వాదన. మరి కొందరు మాత్రం దీంతో ఏకీభవించడం లేదు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడం లేదని, కరోనా వ్యాధి తీవ్రత తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు.

ఇవీ చదవండి: కరోనా సెకండ్ వేవ్, దేశంలో ఏ వయస్కులకు రిస్క్ ఎక్కువో తేల్చిన నిపుణులు,

Night Curfew: తెలంగాణలో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ.. ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు.. మినహాయింపులు ఎవరికి ?

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు