Night Curfew: తెలంగాణలో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ.. ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు.. మినహాయింపులు ఎవరికి ?

రెండో విడతలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Night Curfew: తెలంగాణలో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ..  ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు..  మినహాయింపులు ఎవరికి ?
Telangana Imposes Night Curfew
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 20, 2021 | 2:15 PM

Telangana Night Curfew:  దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వికృతరూపం ప్రదర్శిస్తోంది. మొదటి సారి కంటే రెండో విడతలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూను విధించడంతో పాటు వీకెండ్‌లలో లాక్‌డౌన్ విధిస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడ ఆ దిశగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే రాత్రి పూట పూర్తి స్థాయి కర్ఫ్యూ విధిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని నుండి అత్యవసర సర్వీలకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.

కర్ఫ్యూ నుంచి మినహాయింపులు:

✹ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, ఫార్మసీలు

✹ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా

✹ టెలికమ్యూనికేషన్స్‌, ఇంటర్‌నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్‌, కేబుల్‌ సర్వీసులు

✹ ఐటీ, ఐటీ ఆధారిత సేవలు

✹ ఇ- కామర్స్‌ వస్తువుల డెలివరీకి అనుమతి

✹ పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, సీఎన్‌జీ, పెట్రోలియం, గ్యాస్‌ అవుట్‌లెట్లు

✹ శక్తి ఉత్పాదన, పంపిణీ

✹ కోల్డ్‌ స్టోరేజీ, వేర్‌హౌజింగ్‌

✹ నీటి సరఫరా, పారిశుద్ధ్యం

✹ ప్రైవేటే సెక్యూరిటీ సర్వీసులు

✹ ప్రొడక్షన్‌ యూనిట్లు

కర్ఫ్యూ సమయంలో వెంట ఉంచుకోవల్సిన ధృవపత్రాలుః

✹ పైన పేర్కొన్న సంస్థల్లో పనిచేసేవారు(ఐడీ కార్డు తప్పక చూపించాలి)

✹ కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాధికారులు ఐడీ కార్డు చూపించి ప్రయాణాలు చేయవచ్చు

✹ డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్‌, ఇతర ఆస్పత్రి సిబ్బందికి అనుమతి.

✹ గర్భిణులు, వైద్య సహాయం తప్పనిసరిగా అవసరమైనవారికి అనుమతి.

✹ ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండు నుంచి రాకపోకలు సాగించేవాళ్లు టికెట్‌ చూపించాలి.

కాగా, కర్ఫ్యూ సమయంలో వీరు మినహా మిగతా పౌరులు బయట తిరగడంపై పూర్తి నిషేధం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో రాష్ట్ర సర్కార్ పేర్కొంది. నైట్‌ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌ 51-60, ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.

ఇదిలావుంటే, తెలంగాణలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కు చేరగా, మరణాల సంఖ్య 1,856కు చేరుకుంది. ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, గతకొన్ని రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికై లాక్‌డౌన్‌ లేదా రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపై 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే తామే ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సర్కారు మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Read Also… YSR Sunna Vaddi scheme: రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము.. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేసిన సీఎం జగన్