Lockdown: ఐదు న‌గ‌రాల్లో లాక్‌డౌన్‌ విధించిన హైకోర్టు.. ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఇంతకూ ఏమందంటే?

Supreme Court: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో నగరాల్లో విచ్చలవిడిగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్,

Lockdown: ఐదు న‌గ‌రాల్లో లాక్‌డౌన్‌ విధించిన హైకోర్టు.. ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఇంతకూ ఏమందంటే?
Lockdown
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 20, 2021 | 2:37 PM

Supreme Court: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో నగరాల్లో విచ్చలవిడిగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి చర్యలను అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో క‌రోనావైర‌స్ వ్యాప్తిని త‌గ్గించేందుకు అయిదు న‌గ‌రాల్లో లాక్‌డౌన్ విధించాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్ర‌యాగ్‌రాజ్‌, ల‌క్నో, వార‌ణాసి, కాన్పూర్‌, గోర‌ఖ్‌పూర్‌ల‌లో ఏప్రిల్ 28వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధించాల‌ని యూపీ ప్రభుత్వానికి అల‌హాబాద్ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

యూపీలోని పలు నగరాల్లో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తేనే, వైర‌స్ వ్యాప్తిని నియంత్రించే అవ‌కాశం ఉన్న‌ట్లు అలహబాద్‌ కోర్టు తీర్పులో వెల్లడించింది. అయితే అల‌హాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై మంగళవారం విచారించిన ధర్మాసనం.. అల‌హాబాద్ కోర్టు ఆదేశాల‌పై స్టే విధిస్తూ మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ. బోబ్డేతో పాటు జ‌స్టిస్ ఏఎస్. బొపన్న‌, వీ. రామ‌సుబ్ర‌మ‌ణియ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం యూపీ ప్ర‌భుత్వం చేసిన అప్పీల్‌ను విచారించింది.

అయితే యూపీ ప్రభుత్వం మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ కోసం తీసుకున్న చ‌ర్య‌ల‌ను హైకోర్టుకు విన్న‌వించాల‌ని ధ‌ర్మాస‌నం యూపీ ప్ర‌భుత్వాన్ని కోరింది. ఈ కేసులో కోర్టుకు స‌హ‌క‌రించేందుకు సీనియ‌ర్ అడ్వ‌కేట్‌గా పీఎస్ న‌ర‌సింహ‌ను అమిక‌స్ క్యూరీగా నియ‌మించింది. న్యాయ‌ప‌ర‌మైన ఆదేశాల ద్వారా లాక్‌డౌన్ విధించ‌డం స‌రైన విధానం కాదని.. యూపీ ప్ర‌భుత్వం త‌న అఫిడ‌విట్‌లో సుప్రీంకోర్టుకు చెప్పింది. దీనివల్ల రాష్ట్రంలో తీవ్ర ప‌రిపాల‌నా స‌మ‌స్య‌ల‌ు తలెత్తుతాయని యూపీ ప్ర‌భుత్వం పేర్కొంది.

Also Read:

ఓ వైపు వ్యాక్సిన్ల తీవ్ర కొరత, మరో వైపు వృధా చేస్తున్న రాష్ట్రాలు, తెలంగాణాలో కూడా !

Corona Patient: గ్వాలియర్‌లో దారుణం.. కరోనా పేషంట్‌పై అత్యాచారయత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు