AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Patient: గ్వాలియర్‌లో దారుణం.. కరోనా పేషంట్‌పై అత్యాచారయత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు కరోనాకు కూడా భయపడటం లేదు. కోవిడ్ వైరస్ బారిన పడిన వారిపై కూడా అత్యాచారానికి యత్నిస్తున్నారు.

Corona Patient: గ్వాలియర్‌లో దారుణం..  కరోనా పేషంట్‌పై అత్యాచారయత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు
Corona Patient Rape Attempt
Balaraju Goud
|

Updated on: Apr 20, 2021 | 12:57 PM

Share

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు కరోనాకు కూడా భయపడటం లేదు. కోవిడ్ వైరస్ బారిన పడిన వారిపై కూడా అత్యాచారానికి యత్నిస్తున్నారు. కరోనా సోకి క్వారంటైన్ సెంటర్ లో చేరితే.. అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ వార్డు బాయ్ కోవిడ్-19 పాజిటివ్ సోకిన వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌లోని లోటస్ హాస్పిటల్‌లో కరోనా సోకిన 59 ఏళ్ల మహిళ చికిత్స పొందుతోంది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెకు వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్సనందిస్తున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళపై.. ఆమె చికిత్స పొందుతున్న వార్డులో పనిచేసే వివేక్ లోధి(25) అనే వార్డు బాయ్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ వెంటనే భయంతో అలారం మోగించడంతో అక్కడి నుంచి వివేక్ పారిపోయాడు. జరిగిన ఘటనపై ఆ మహిళ తమ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

సదరు మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై సెక్షన్ 376, 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ ఘటన కారణంగా ఆమెకు హాస్పిటల్ ఉద్దేశపూర్వకంగా ట్రీట్‌మెంట్ నిలిపివేసిందని, హాస్పిటల్ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. లోధిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హాస్పిటల్ పరువు పోయిందని భావించిన యాజమాన్యం తమను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించాడు.

Read Also…  కరోనా బారిన పడ్డ జబర్దస్త్ బ్యూటీ.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది అంటూ ఎమోషనల్….