కరోనా సెకండ్ వేవ్, దేశంలో ఏ వయస్కులకు రిస్క్ ఎక్కువో తేల్చిన నిపుణులు,

కరోనా సెకండ్ వేవ్ లో ఏ వయస్సువారికి రిస్క్ ఎక్కువ ఉంటుందో నిపుణులు తేల్చారు. ఈ రెండో 'బీభత్సం' లో 40 లేదా అంతకన్నా ఎక్కువ వయస్కులకు ముప్పుఉంటుందని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. తాము 9.485 మంది రోగుల

కరోనా సెకండ్ వేవ్,  దేశంలో ఏ వయస్కులకు  రిస్క్ ఎక్కువో తేల్చిన నిపుణులు,
40 Plus More Vulnerable In 2nd Wave Covid 19 Says Icmr Chief Bharagava
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 20, 2021 | 2:30 PM

కరోనా సెకండ్ వేవ్ లో ఏ వయస్సువారికి రిస్క్ ఎక్కువ ఉంటుందో నిపుణులు తేల్చారు. ఈ రెండో ‘బీభత్సం’ లో 40 లేదా అంతకన్నా ఎక్కువ వయస్కులకు ముప్పుఉంటుందని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. తాము 9.485 మంది రోగుల డేటాను విశ్లేషించామని, తొలి వేవ్ లో సగటున 50 ప్లస్ వయస్సులవారు  రిస్క్ ఎదుర్కోగా ఈ సెకండ్ వేవ్ లో 40 ప్లస్ వయస్సుల వారు కూడా ఈ ముప్పు ఎదుర్కొన్నట్టు వెల్లడైందని ఆయన చెప్పారు. ఈ రెండో వేవ్ లో 70 శాతం పైగా రోగులు 40 ఏళ్లకు పైబడినవారేనన్నారు. గత ఏడాది కరోనా వైరస్ తో ఆసుపత్రి పాలైన 31 శాతం మందికి పైగా రోగుల్లో పలువురు 30 ఏళ్లలోపువారేనని, ఈ సారి  ఇది 32 శాతం ఉందని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే.పాల్ తెలిపారు.అంటే గత ఏడాదికి, ఈ సారికి పెద్దగా తేడా లేదని వెల్లడైందన్నారు.

ఈ తరుణంలో ఆక్సిజన్ అవసరాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే వెంటిలేటర్ ఆవశ్యకత ఎక్కువగా లేదని బలరాం భార్గవ చెప్పారు. మొదటి దశలో చాలామంది పొడిదగ్గు, గొంతు నొప్పితో ఎక్కువగా బాధ పడగా.. ఈ సారి రోగులకు శ్వాస సరిగా ఆడకపోవడం వంటి రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కాగా నీరసం, అలసట, ఒంటి నొప్పులు ఈ దశలోనూ ఉన్నాయని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోవడం, నిర్లక్ష్యం, మాస్కులు ధరించకపోవడం వంటి వాటి వల్ల ఈ సెకండ్ వేవ్ విజృంభిస్తోందని,  వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవలసి ఉందని భార్గవ పేర్కొన్నారు.  వ్యాక్సిన్ల కొరత ఆందోళన కలిగించేదిగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుధ్ధ ప్రాతిపదికన  చేపట్టాలని ఆయన సూచించారు. అటు మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడినవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఈ చర్య ముందే తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.