Smallest Cow: బుజ్జి ఆవుకు.. బుల్లి దూడ.. తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేస్తున్న చిట్టి దూడ

Smallest Cow: తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఆవు సందడి చేస్తోంది. పుట్టిన ఈ బుజ్జి ఆవుదూడను చూసేందుకు జనాలు తరలివస్తున్నాయి. చిన్నగా ఉన్న ఆ ఆవుదూడ చిన్నారి.

Smallest Cow: బుజ్జి ఆవుకు.. బుల్లి దూడ.. తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేస్తున్న చిట్టి దూడ
Smallest Cow
Follow us

|

Updated on: Apr 20, 2021 | 7:30 PM

Smallest Cow: తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఆవు సందడి చేస్తోంది. పుట్టిన ఈ బుజ్జి ఆవుదూడను చూసేందుకు జనాలు తరలివస్తున్నాయి. చిన్నగా ఉన్న ఆ ఆవుదూడ చిన్నారి చేతిలో ఓ బొమ్మలా కనిపిస్తోంది. ఈ బుజ్జి ఆవు దూడ సైజు 13.5 అంగుళాలు ఎత్తు 22 అంగుళాలు మాత్రమేనట. ఈ బుల్లి ఆవుదూడ తూర్పుగోదావరి జిల్లా గుమ్మిలేరులోని ఓ రైతు ఇంట సందడి చేస్తోంది.

మలికిపురం మండలం పడమటి పాలెంలో జంతు ప్రేమికుడు గుండా బత్తుల మధు ఆవులమందలో ఈ బుల్లి ఆవు పుట్టింది. అతని ఇంట్లోని పుంగనూరు ఆవు అతి చిన్న చిట్టి దూడకు జన్మనిచ్చింది. బుజ్జి ఆవు దూడను చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఆవు దూడ సైజు 13.5 అంగుళాలు ఎత్తు 22 అంగుళాల పొడవు కలిగి ఉండటంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ అవు దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం క్యూ కడుతున్నారు. ఈ చిట్టి ఆవు పుట్టినప్పటి నుండి ఎంతో మంది చూడడానికి రావడం నాకు సంతోషాన్ని ఇస్తుందని మధు చెబుతున్నారు. తన ఆవుల మందలో 35 రకాల ఆవులు ఉన్నాయి. గుర్రాలు, బిన్నీ ఫిక్స్, విదేశీ పిల్లులు పెంచడం అన్నా మధుకు ఎంతో ఇష్టమట.

ఇవీ చదవండి: LIC Paytm: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త… డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం

Coronavirus: కరోనా హాట్‌స్పాట్‌గా మారిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గం… వరుసగా కోవిడ్‌ బారిన పడుతున్న నేతలు