AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiktok Bhargav: చెల్లి.. చెల్లి అంటూనే బాలికలపై టిక్‌టాక్ స్టార్‌ భార్గవ్‌ అత్యాచారం.. అరెస్టు చేసిన పోలీసులు

Tiktok Bhargav: టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 18 ఏళ్ల మైనర్‌ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది....

Tiktok Bhargav: చెల్లి.. చెల్లి అంటూనే బాలికలపై టిక్‌టాక్ స్టార్‌ భార్గవ్‌ అత్యాచారం.. అరెస్టు చేసిన పోలీసులు
Tiktok Bhargav
Subhash Goud
|

Updated on: Apr 20, 2021 | 5:52 PM

Share

Tiktok Bhargav: టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 18 ఏళ్ల మైనర్‌ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్టు చేశారు. టిక్‌టాక్‌ వీడియోల పేరుతో మైనర్‌ బాలికను లొంగదీసుకుని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పోలీసు స్టేషన్‌లో భార్గవ్‌పై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొల్లవలస ప్రాంతానికి చెందిన భార్గవ్‌ టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన విషయం తెలిసిందే. అయితే అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల మైనర్‌ బాలికతో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్‌ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు.

విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ భార్గవ్‌ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ పరిచయంతో మైనర్‌ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే తరచూగా ఇద్దరు చాటింగ్‌ చేసుకోవడం, కలుసుకుంటుండటంతో వీరి మధ్య పరిచయం ఎక్కువైపోయింది. టిక్‌టాక్‌ వీడియోల పేరుతో భార్గవ్‌ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలే బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లిదండ్రులు వైద్యులను వద్దకు తీసుకెళ్లగా, ఆమె అప్పటికే నాలుగు నెలల గర్భిణిగా తేలింది. ఇందుకు కారణంగా భార్గవ్‌ అని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు ఈనెల 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది. బాలికను చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు భార్గవ్‌ సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు రిమాండ్ విధించారు.

ఇవీ చదవండి: Corona Virus:మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? కోవిడ్ పాజిటివ్ దంపతులను ఇంట్లో పెట్టి.. లాక్ వేసిన ఎదురింటి ప్లాట్ ఓనర్

CM Wife Corona Positive: ముఖ్యమంత్రి భార్యకు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ముఖ్యమంత్రి..