Telangana Night Curfew: తెలంగాణలో ప్రారంభమైన నైట్ కర్ఫ్యూ… నిషేధం.. మినహాయింపు వీరికే..
Telangana Night Curfew: కరోనా కట్టడిలో భాగంగా రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా, గతంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదు..
Telangana Night Curfew: కరోనా కట్టడిలో భాగంగా రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా, గతంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతుండగా, తాజాగా సుమారు ఐదారు వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
మినహాయింపులు..
మీడియా, పెట్రోల్ బంక్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపులు, ఇక నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఈ-కామర్స్ సేవలు, ఆహార పదార్థాల పంపినీ, కోల్ట్ స్టోరేజీలు, గోడౌన్‌లకు రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇచ్చింది.
నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు వ్యాలిడ్ టికెట్లు ఉంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. వైద్యం కోసం వెళ్లే గర్భిణులు, రోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు. అంతరాష్ర్ట రవాణాకు ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిషేధం విధించినవి..
జనాలు బయట తిరగడం, సినిమా థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హోటళ్లు రాత్రి 8 గంటల తర్వాత బంద్ కానున్నాయి. నైట్ కర్ఫ్యూలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే కర్ఫ్యూ విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. గతంలో నిబంధనలు పాటించాలని పదేపదే చెబుతున్నా.. చాలా మంది ఉల్లంఘించారని, అలాంటి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, ఇప్పుడు కూడా అదే చేస్తామని అన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని అన్నారు.