లడ్డూ కావాలా నాయనా.. ఏడాదికి కేవలం రెండు నెలలే.. ఈ స్వీట్ హిస్టరీ తెలిస్తే

ఆ లడ్డూకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ లడ్డూ తినడం మన ఆరోగ్యనికి కూడా చాలా మంచిది. అలా అని ఈ లడ్డూ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు అండోయ్. కేవలం సంవత్సరంలో ఒకేసారి అది కూడా చలికాలంలోనే దొరుకుతుంది.

లడ్డూ కావాలా నాయనా.. ఏడాదికి కేవలం రెండు నెలలే.. ఈ స్వీట్ హిస్టరీ తెలిస్తే
Sweets
Follow us
P Shivteja

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2024 | 8:35 PM

సంగారెడ్డి జిల్లాలో ఆ లడ్డూకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ లడ్డూ తినడం మన ఆరోగ్యనికి కూడా చాలా మంచిది. అలా అని ఈ లడ్డూ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు అండోయ్. కేవలం సంవత్సరంలో ఒకేసారి అది కూడా చలికాలంలోనే దొరుకుతుంది. ఈ లడ్డూ కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూసే వాళ్లు కూడా ఉన్నారు తెలుసా.! లడ్డూకి సంబంధించి వివరాల్లోకి వెళ్తే..

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన స్వీట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. దాని పేరే ‘మురుండా లడ్డు’. ఈ స్వీట్ సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నవంబర్, డిసెంబర్ సమయంలో ఈ లడ్డూ దొరుకుతుంది. ఈ లడ్డూ కోసం ప్రజలు కొన్ని నెలల ముందు నుంచే కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఈ లడ్డూకు అంత క్రేజ్ మరి.. ఈ లడ్డూను అందరూ తయారు చేయలేరు. తరతరాలుగా ఇందులో ప్రావీణ్యం సంపాదించిన కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో ప్రత్యేక వంటవారితో దీనిని తయారు చేయిస్తారు. ఈ లడ్డూను సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేస్తారు. ఈ లడ్డూ తయారికి చాలా సమయం తీసుకుంటుంది. దీన్ని తయారు చేయడానికి ప్రధానంగా చెరుకు రసం, కొబ్బరి పొడి, కాజూ, కిస్మిస్, బాదం, నువ్వులు, నెయ్యి, వివిధ పప్పు దినుసులతో పాటు మక్క పిండిని సైతం ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

దీని కారణంగా దాని పొరలు చాలా స్ఫుటంగా, రుచిగా ఉంటాయి. మురుండా లడ్డూలో పోషకాలు(కాల్షియం, విటమిన్స్) సమృద్ధిగా ఉంటాయి. దీన్ని సిద్ధం చేయడానికి గంటల కొద్దీ కష్టపడాల్సి వస్తుంది. అన్ని రకాల పదార్థాలతో తయారు చేయడం ద్వారా దీని రుచి చాలా బాగుంటుంది. మురుండా లడ్డూ అనేది కేవలం స్వీట్ మాత్రమే కాదు.. దీని తయారీ అనేది ఓ కళ అని చెప్పాలి. దీని తయారీ ప్రక్రియలో అడుగడుగునా సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తారు. అందుకే ఇది సంవత్సరంలో 2 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏడాదికి ఒకసారి చలికాలంలో మాత్రమే మార్కెట్‌లో దొరుకుతుంది. అందుకే ప్రజలు దీన్ని రుచి చూసే ఏ అవకాశాన్ని వదులుకోరు. నారాయణఖేడ్, కంగ్టిలోని మార్కెట్‌లోకి ఈ లడ్డూ వచ్చినప్పుడు దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని కొనుగోలు చేయడానికి సంతలో ప్రజలు ఎగబడుతారు. మార్కెట్‌లో మురుండా లడ్డూ ధరలు ప్రతిసారి మారుతూ ఉంటాయి.

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..