MUNUGODE BYPOLL: మునుగోడు బైపోల్స్‌లో టీఆర్ఎస్సా? బీఆర్ఎస్సా? గులాబీ పెద్దలు కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు చుట్టూ తిరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు శాసనసభ స్థానం ఖాళీ అయింది. దీంతో మునుగోడు బై పోల్ కు కేంద్ర ఎన్నికల సంఘం..

MUNUGODE BYPOLL: మునుగోడు బైపోల్స్‌లో టీఆర్ఎస్సా? బీఆర్ఎస్సా? గులాబీ పెద్దలు కీలక నిర్ణయం
Munugode Bypoll
Follow us

|

Updated on: Oct 07, 2022 | 10:42 AM

తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు చుట్టూ తిరుగుతోంది. నవంబర్ 6వ తేదీన జరిగే ఉఎ ఎన్నిక కోసం అన్ని పార్టీలు సమయాత్తమవుతున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేయనున్నారు. అయితే టీఆర్ ఎస్ మాత్రం తన అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేయలేదు. టీఆర్ ఎస్  పేరుతో పోటీచేయాలా, కొత్త పార్టీ బీఆర్ ఎస్ పేరుతో పోటీ చేయాలనే అనే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ ఎస్ పేరును అధికారికంగా గుర్తిస్తే మాత్రం కొత్త పార్టీ పేరుతోనే మునుగోడు బరిలో దిగనుంది కారు పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించకపోతే ఏం చేయాలనేదానిపై కూడా సీఏం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. మొత్తం మీద కారు పార్టీ టీఆర్ ఎస్ పేరుతో పోటీచేస్తుందా, బీఆర్ ఎస్ తో పోటీ చేస్తుందా అనే దానిపై మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈరోజు (అక్టోబర్ 7వ తేదీ) మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 14 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వరకు గడువు ఉంటుంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ నిర్వహించి.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో మునుగోడులో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ శక్తినంతా ఒడ్డుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని అధికారికంగా ప్రకటించింది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇక అధికార టిఆర్ ఎస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. టీఆర్ ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి ( బీఆర్ ఎస్ )గా మారుస్తూ టీఆర్ ఎస్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈ తీర్మాన కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పును గుర్తించాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లోనే టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించే అవకాశం ఉందని తెలంగాణలోని అధికారపార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల గడువు ముగిసేవరకు వేచి చూసే ధోరణిలో టీఆర్ ఎస్ ఉంది.

అక్టోబర్ 14వ తేదీ లోపు బీఆర్ ఎస్ ను అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తే కొత్త పేరుతోనే పోటీలో ఉండాలని సీఏం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇటీవల పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో కొత్త పార్టీ పేరుతోనే మునుగోడు పోటీలో ఉంటామని కేసీఆర్ ప్రకటించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ ఎస్ గా గుర్తించడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో టీఆర్ ఎస్ పేరుతోనే పోటీచేయాలని అనుకున్నారు. అయితే మరో రెండు లేదా మూడు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ ఎస్ ను అధికారికంగా గుర్తించే అవకాశం ఉందన్న సమాచారంతో నామినేషన్ల గడువు తుది వరకు వేచిచూసే ధోరణిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మునుగోడులో టీఆర్ ఎస్ అభ్యర్థి ప్రకటన మరింత ఆలస్యం కానుంది.

బీఆర్ ఎస్ పేరుతోనే మునుగోడులో పోటీచేయాలని కేసీఆర్ డిసైట్ అవడానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడులో టీఆర్ ఎస్ బలంగా ఉండటంతో పాటు, గెలిచే అవకాశాలు తమకు ఉన్నాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తూ కొత్త పార్టీ పేరును ప్రకటించిన నేపథ్యంలో.. మొదటి ఎన్నికల్లోనే తాము కొత్త పార్టీ పేరుతో గెలిచామనే ప్రచారంతో పాటు, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రంగప్రవేశం చేయడాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, దీనిక సంకేతమే మునుగోడులో గెలుపు అనే ప్రచారం కోసం కూడా బీఆర్ ఎస్ పేరుతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు మారిన తర్వాత తొలి విజయం కోసం కూడా బీఆర్ ఎస్ పేరుతో పోటీచేసేందుకు కేసీఆర్ వెయిట్ చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు టీఆర్ ఎస్ నుంచి మునుగోడులో పోటీ చేయడానికి ఆశావహుల సంఖ్య ఎక్కువుగా ఉండటంతో, ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే అసమ్మతి పెరిగి, అది పార్టీకి నష్టం చేసే అవకాశం ఉండటంతో పాటు, ఎవరైనా అభ్యర్థులు రెబల్ గా బరిలోకి దిగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందనే అంచనాతో చివరి నిమిషంలో.. అభ్యర్థిని ప్రకటించి, రెబల్ అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వకూడదనే ఆలోచన కూడా అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు సీఏం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారనే చర్చ సాగుతోంది. అయితే ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్థానికంగా కొంతమంది నాయకులు వ్యతిరేకిస్తుండటంతో చివరి వరకు వెయిట్ చేసి, వారందరిని బుజ్జగించే ప్రయత్నంలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనప్పటికి ప్రచారం కోసం అధికారపార్టీ పార్టీ ఇన్ ఛార్జిలను నియోజకవర్గానికి వెళ్లాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం సాయంత్రానికి ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు.

మొదటి రోజే నగదు పట్టివేత

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 7 (శుక్రవారం) నుంచి నామినేషన్ల ప్రక్రియం ప్రారంభమైంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. మునుగోడులో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన రోజే అధికారులు 13 లక్షల రూపాయలను పట్టుకున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోకి అక్రమ మద్యం, డబ్బు నిరోధించేందుకు 14 పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే తనిఖీలో భాగంగా మునుగోడు మండలం గుడపురి పోలీస్ చెక్ పోస్టు వద్ద రూ.13 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చండూరు మండలం బీమనపల్లి కీ చెందిన నరసింహ తన తన కారులో రూ.13 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును, పండగకు సొంత ఇంటికి వస్తూ తీసుకువచ్చానని… మళ్లీ ఆ డబ్బును హైదరాబాద్ కు తీసుకువెళుతున్ననని నరసింహరావు తెలిపాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?