AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode By-poll: మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల తొలి రోజే పట్టుబడిన నోట్ల కట్టలు..

మునుగోడు నామినేషన్ల పర్వ మొదలైంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ల తొలి రోజే మునుగోడు నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది.

Munugode By-poll: మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల తొలి రోజే పట్టుబడిన నోట్ల కట్టలు..
Money Seize
Sanjay Kasula
|

Updated on: Oct 07, 2022 | 11:52 AM

Share

మునుగోడు నామినేషన్ల సందడి మొదలైంది. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. నల్గొండ కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరు మండల ఆఫీసులో నామినేషన్లు స్వీకరిస్తారు. రిటర్నింగ్‌ అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావును వ్యవహరిస్తున్నారు. నామినేషన్లపై సందేహాలు తీర్చేందుకు హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియను వీడియో షూట్‌ చేస్తారు.

అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్‌ ఫోకస్‌..

మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం మొదలవడంతో అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. మునుగోడు నియోజకవర్గ నాయకులతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యతో చర్చలు జరుపుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కూడా ప్రగతిభవన్‌కు వచ్చారు. ఉప ఎన్నిక అభ్యర్థిపై ముగ్గురితో చర్చిస్తున్నారు కేటీఆర్. బీఆర్‌ఎస్‌ విషయం తేలేవరకూ క్యాండేట్‌ ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. బీఆర్‌ఎస్‌తో ఉప ఎన్నికకు వెళ్లాలని అనుకుంటున్న టీఆర్‌ఎస్‌… ఈనెల 14న నామినేషన్ల గడువు ముగిసేవరకూ వేచి ఉండాలని చూస్తోంది. చివరి రోజు అభ్యర్థిని ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. 14మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలకు ఉపఎన్నికల బాధ్యతలు ఇచ్చారు. ఇవాళ నుంచే మునుగోడు పర్యటించి గెలుపునకు కృషిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అప్పుడే నోట్ల కట్టల ప్రవాహం..

మరోవైపు ఇటు నామినేషన్లు మొదలయ్యాయో లేదో.. అటు నగదు కూడా పట్టుబడుతోంది. మునుగోడు మండలం గండపురి చెక్‌పోస్టు దగ్గర రూ. 13లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చండూరు మండలం భీమనపల్లికి చెందిన నరసింహ నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ప్లాట్‌ అమ్మగా వచ్చిన డబ్బు అని నరసింహ పోలీసులకు వెల్లడించాడు.

 ఎన్నికల కోడ్ అమలు.. విగ్రహాలకు ముసుగులు..

నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చింది. ఎన్నికల రూల్స్‌ ప్రకారం విగ్రహాలకు ముసుగులు తొడుగుతున్నారు. వాల్‌పోస్టర్లు, ప్లెక్సీలను తొలగిస్తున్నారు. ఏడుమండలాల్లో ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కోసం 6 టీమ్‌లు, సర్వే సాస్టిక్‌ టీమ్‌లు 6. ప్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌‌లు 7, వీడియో సర్వేలైన్స్‌ కోసం6 టీమ్‌లు పనిచేస్తున్నాయి.

ఇవాళ్టి నుంచి ఈనెల14వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే యాదాద్రి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది… కోడ్ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..