Munugode Bypoll: ‘ఓటుకు రూ. 40 వేలు పంచేందుకు సిద్ధమైన టీఆర్ఎస్’.. సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్..
మునుగోడులో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..
మునుగోడులో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఉపఎన్నిక అనే విషయాన్ని మునుగోడు ఓటర్లు గుర్తించారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటుకు రూ. 40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపించారు బండి సంజయ్. వరంగల్‌లో తన రాజకీయ గురువు గుజ్జల నర్సయ్య సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. అనుకూలంగా ఉండే అధికారులను బదిలీ చేసుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్‌ను ఇతర పార్టీలను ఓడించాల్సిన అవసరం లేదని, వాళ్లను వాళ్లే ఓడిస్తారని సంజయ్ అన్నారు.
ఇదే సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. లిక్కర్ స్కామ్‌పై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మౌనంగా ఉన్నారంటే కుంభకోణాన్ని ఒప్పుకున్నట్టేనని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతుందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందన్నారు. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేశారని ఆరోపించారు సంజయ్. ఫోన్ ట్యాపింగ్ సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉపఎన్నిక నామినేషన్స్ స్టార్ట్..
మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడమే తరువాయి. అన్ని పార్టీల అభ్యర్థులు పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థులందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఇంత వరకు ఏనాడూ ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగలేదు. 55 ఏళ్ల నియోజకవర్గ చరిత్రలో ఇది తొలి ఉపఎన్నిక. మునుగోడు అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఐ, ఒక్కసారి టీఆర్ఎస్ అభ్యర్థిని మునుగోడు ఓటర్లు ఎన్నుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..