Big News Big Debate: మునుగోడు రేసులో బీసీలు వెనకపడ్డారా.? మనీ పాలిటిక్స్ మంత్రం పనిచేసిందా..?
మునుగోడు రేసులో బీసీలు వెనకపడ్డారా.? మూడుపార్టీలు రెడ్డి వర్గానికే టికెట్లు ఎందుకిచ్చాయి..? మనీ పాలిటిక్స్ మంత్రం పనిచేసిందా.? నియోజకవర్గంలో ఓటరు నాడి ఎలా ఉంది..?
మునుగోడులో అసలైన యుద్ధం మొదలైంది. ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది, అటు పార్టీలు కూడా అభ్యర్ధులను ఖరారు చేశాయి. ఊహించినట్టుగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అధికారపార్టీ టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ చేసింది. ఇక కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ఇప్పటికే ప్రచారంలో ఉండగా… రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన దగ్గర నుంచే వ్యూహాల్లో మునిగితేలుతున్నారు. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికే మూడు పార్టీలు టికెట్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైరల్ వీడియోలు
Latest Videos