TRS: మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధిని ఖరారు చేసిన టీఆర్ఎస్.. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించిన సీఎం కేసీఆర్

TRS: మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధిని ఖరారు చేసిన టీఆర్ఎస్.. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించిన సీఎం కేసీఆర్

Ravi Kiran

|

Updated on: Oct 07, 2022 | 12:32 PM

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య వంటి నేతలు టికెట్లు ఆశించినప్పటికీ..



మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య వంటి నేతలు టికెట్లు ఆశించినప్పటికీ కూసుకుంట్ల వైపే గులాబీ బాస్ మొగ్గు చూపారు. కొన్ని వారాలుగా నియోజకవర్గంలో కేపీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఉపఎన్నిక పోరులో బీజేపీ నుంచి సిట్టింగ్ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ పడుతున్నారు. అటు మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. నల్గొండ కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరు మండల ఆఫీసులో నామినేషన్లు స్వీకరిస్తారు. రిటర్నింగ్‌ అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావును వ్యవహరిస్తున్నారు. నామినేషన్లపై సందేహాలు తీర్చేందుకు హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియను వీడియో షూట్‌ చేస్తారు.

Published on: Oct 07, 2022 12:08 PM