Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్ట్.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య పీక్స్‌కు చేరిన కాంట్రాక్ట్‌ల లొల్లి..

మునుగోడులో ‘కాంట్రాక్ట్‌ కాక మొదలైంది’. వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారని టీఆర్‌ఎస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్ట్.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య పీక్స్‌కు చేరిన కాంట్రాక్ట్‌ల లొల్లి..
Komatireddy Raj Gopal Reddy
Follow us

|

Updated on: Oct 08, 2022 | 4:42 PM

మునుగోడులో ‘కాంట్రాక్ట్‌ కాక మొదలైంది’. వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారని టీఆర్‌ఎస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఆయన నిజాయితీగా తన కంపెనీకి ఉన్న పేరుతో కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య కాంట్రాక్ట్‌ల లొల్లి సవాళ్లు, రాజీనామాల వరకూ వెళ్లింది.

మునుగోడు బైపోల్‌కి సంబంధించి టీవీ9 బిగ్ డిబేట్‌కి ముందు ఒక లేక్క. తర్వాత మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి మారింది. అవును, టీవీ9 వేదికగా మరో లెవెల్‌కి చేరింది ఈ మాటలయుద్ధం. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ బిగ్‌ న్యూస్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కాంట్రాక్టులకు సంబంధించి కీలక వివరాలు తెలిపారు. బీజేపీతో చేతులు కలపడం వెనక ఆర్థిక లావాదేవీలు కాంట్రాక్టుల రూపంలో జరిగాయా అని అడిగిన ప్రశ్నకు రాజ్ గోపాల్ రెడ్డి జరగలేదని చెప్పారు. అలా నిరూపిస్తే దేనికైనా సిద్ధం అన్న ఆయన.. రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటానని అన్నారు. లేదంటే కేటీఆర్ రాజీనామా చేయాలి అని సవాల్ విసిరారు. తనకు బీజేపీ ద్వారా ఏ కాంట్రాక్టు రాలేదు అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

వెంటనే రియాక్ట్ అయిన రజినీకాంత్.. ఆ కాంట్రాక్టులను బీజేపీ ఇప్పించలేదు, స్వతహాగా మీకు గానీ, మీ కుమారుడికి సంస్థకు గానీ ఏమైనా కాంట్రాక్టులు వచ్చాయా? అని అడిగితే అవును అని సమాధానం చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు.. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు తనకు 6 నెలల ముందు వచ్చిందన్న రాజగోపాల్ రెడ్డి.. బీజేపీతో 3 ఏళ్లుగా దగ్గరగా ఉంటున్నాని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి చెప్పిన వివరాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు మునుగోడు రాజకీయాలనే కాదు.. యావత్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో పెను దుమారం సృష్టిస్తోంది. అటు కాంగ్రెస్ నేతలు ఇటు టీఆర్ఎస్ నేతలు, మరోవైపు బీజేపీ నేతలు సహా అందరూ ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ ఒకరిపై ఒకరు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు.

మంత్రి కేటీఆర్ అటాక్..

క్విడ్‌ ప్రోకో జరిగిందని మునుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా ఒప్పుకున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా రాజగోపాల్ రెడ్డి వెల్లడించిన లెక్కలకు సంబంధించిన వీడియో ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కేటీఆర్.. విమర్శల వాడిని మరింత పెంచారు. రాజగోపాల్ రెడ్డి కంపెనీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు పొందిందని, దానికి ప్రతిఫలంగానే ఆయన బీజేపీలో చేరారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఎంపీ వెంకట్ రెడ్డి కూడా ఆయన బాటలోనే పయనించనున్నారని అన్నారు.

బొగ్గు గోపాల్ రెడ్డి అంటూ..

మరోవైపు బీజేపీపై విమర్శల దాడి పెంచింది కాంగ్రెస్‌. రాజగోపాల్‌రెడ్డిని బొగ్గు గోపాల్‌గా సంబోధించారు ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్కంఠాగూర్‌. కాంగ్రెస్ చెప్పిందే.. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి అంగీకరించారంటూ ట్వీట్‌ చేశారు. బొగ్గు గోపాల్ కంపెనీకి ఇచ్చిన బొగ్గు కాంట్రాక్టు విలువ రూ. 18 వేల కోట్లన్నారు. అందుకే బొగ్గు గోపాల్‌ బీజేపీలో చేరాడని విమర్శించారు మాణిక్కంఠాగూర్‌.

విమర్శలకు కౌంటర్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి..

కాంట్రాక్టుల విషయంలో తనపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన ఆయన.. బిగ్‌ న్యూస్ బిగ్ డిబేట్‌లో తాను చేసిన ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తాను తప్పు చేసినట్లు ఆధారాలతో కేటీఆర్ నిరూపిస్తే తాను మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపొతే కేటీఆర్ తన పదవులకు రాజీనామా చేస్తాడా? అంటూ సవాల్ విసిరారు రాజగోపాల్ రెడ్డి.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తల ఫైర్..

ఈ గోల ఇలా ఉంటే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్‌ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయన్ను వెంటనే కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీకి కోవర్ట్‌గా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయన మునుగోడు ప్రచారానికి ఎందుకు రావడం లేదని నిలదీశారు. కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీకి నష్టం కలిగిస్తున్న ఆయన్ని వెంటనే సస్పెండ్‌ చేయాలని అన్నారు. ఇటు టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై రాజగోపాల్‌ రెడ్డి స్పందించారు. ధర్మంవైపే తన సోదరుడు ఉంటారని అన్నారు. సమయం వచ్చినపుడు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??