AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: మునుగోడు బీఎస్పీ అభ్యర్థిని ప్రకటించిన ప్రవీణ్ కుమార్

మునుగోడు ఎన్నిక కాక రోజురోజుకు పెరుగుతుంది. పొలిటికల్ పరిణామాలు గంటగంటకు మారిపోతున్నాయి. సెమీ ఫైన‌ల్‌లో సత్తా చాటాలని అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

Munugode Bypoll: మునుగోడు బీఎస్పీ అభ్యర్థిని ప్రకటించిన ప్రవీణ్ కుమార్
Telangaan BSP Chief Rs Praveen Kumar
Ram Naramaneni
|

Updated on: Oct 08, 2022 | 5:58 PM

Share

మునుగోడులో అసలైన యుద్ధం మొదలైంది. ఎన్నికల కమిషన్‌ నుంచి నోటిఫికేషన్‌ వచ్చేసింది, అటు పార్టీలు కూడా అభ్యర్ధులను ఖరారు చేశాయి. ఊహించినట్టుగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అధికారపార్టీ టీఆర్ఎస్ టికెట్‌ కన్ఫామ్‌ చేసింది. ఇక కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి ఇప్పటికే ప్రచారం చేస్తుండగా.. తాజాగా రాజగోపాల్‌ రెడ్డిని తమ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది బీజేపీ. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. బహుజన్‌ సమాజ్‌ పార్టీ కూడా తమ అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఆందోజు శంకరా చారిని తమ పార్టీ తరఫున బరిలోకి దింపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి నుంచి అనుమతి వచ్చినట్లు.. రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

పార్టీల మధ్య ఎత్తులు.. పై ఎత్తులుతో నియోజకవర్గం వేడెక్కింది.. అప్పుడే మనీ పాలిటిక్స్‌ కూడా రాజ్యమేలుతున్నాయి.. కోడ్‌ అమల్లోకి వచ్చిన తొలిరోజే ఏకంగా 13లక్షల రూపాయల నగదు పట్టుకున్నారు. నిఘా కోసం భారీ ఎత్తున బలగాలను, ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపింది ఎన్నికల సంఘం. కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతిని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె ప్రచారంలో స్పీడు పెంచారు. పీసీసీ సీనియర్‌ నాయకులు మండలాలవారీగా బాధ్యతలు తీసుకుని మరీ ప్రచారం పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రోజు నుంచే కదనరంగంలో దిగిన బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్‌ రెడ్డి నోటిఫికేషన్‌ రావడంతో మరింత దూకుడుగా పెంచుతున్నారు. హైకమాండ్‌ నుంచి వచ్చిన ఇంఛార్జులు.. రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడే మకాం వేసి విజయం కోసం శ్రమిస్తున్నారు. ముందు నుంచీ ప్రచారంలో జోరుమీదన్న టీఆర్ఎస్‌ అభ్యర్ధి విషయంలో చాలకాలం పాటు మేథోమథనం చేసిన చివరకు కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికే ఓకే చేసింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన అనుభవం, ఆర్ధిక, అంగబలం అనుకూలంగా ఉండటంతో మొగ్గుచూపారు.

బీసీలు కీలకం.. కానీ రెడ్లకే టికెట్లు 

మునుగోడులో బీసీలు బలంగా ఉన్నారు. వారి ఓటు బ్యాంకే ఎన్నికల్లో కీలకం, కానీ ప్రధానపార్టీలు రెడ్డి సామాజికవర్గానికే టికెట్‌ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ సామాజిక వర్గం కంటే కూడా అభ్యర్ధి ఎంపికలో మనీ పాలిటిక్స్‌ కీలకపాత్ర పోషించినట్టు చెబుతున్నారు. సహజంగానే రాజగోపాల్‌ రెడ్డి సిట్టింగ్‌ కావడం, బీజేపీలో బీసీల నుంచి బలమైన నాయకులు స్థానికంగా లేకపోవడంతో ఈ వర్గాల నుంచి పోటీ లేకుండా పోయింది. కానీ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ల నుంచి బీసీ వర్గానికి చెందిన కీలక నేతలు టికెట్లు ఆశించారు. కానీ అధిష్టానాన్ని ఒప్పించలేకపోయారు. మరి ఎన్నికల్లో నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉండబోతుందో చూడాలి.

మునుగోడులో సామాజికవర్గాలు – ఓటుశాతం మొత్తం ఓటర్లు – 2లక్షల 27వేల 101


ఎస్సీలు – 35,411 (15.6 శాతం)

ఓసీలు – 20,290 (8.9 శాతం)

ఎస్టీలు – 13000 (5.7 శాతం)

మైనారిటీలు- 8000 (3.5 శాతం)

———————

బీసీల్లో

గౌడ – 38,000 (16.7)

గొల్ల, కురుమ -35,000 (15.4)

ముదిరాజ్ -34,500 (15.2)

పద్మశాలి -19,000 (8.4)

వడ్డెర -8300 (3.6)

విశ్వ బ్రాహ్మణ -7800 (3.4)

కుమ్మరి -7800 (3.4)

—————

ఎస్సీలలో

మాదిగ -25000 (11.0)

మాల -10411 (4.6)

——–

ఓసీలలో

రెడ్డి – 7701 (3.3)

కమ్మ -4,880 (2.1)

వెలమ -2,360 (1.0)

వైశ్య -3760 (1.6)

ఇతరులు- 1, 589 (0.9)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కష్టాలు తొలగించే.. విజయ ఏకాదశిపై బ్రహ్మ దేవుడు ఏం చెప్పాడో తెలుసా
కష్టాలు తొలగించే.. విజయ ఏకాదశిపై బ్రహ్మ దేవుడు ఏం చెప్పాడో తెలుసా
నిరుపేద విద్యార్ధులకు ఉచితంగా నీట్, EAPCET 2026 కోచింగ్
నిరుపేద విద్యార్ధులకు ఉచితంగా నీట్, EAPCET 2026 కోచింగ్
అందుకే ఫామ్‌లో గిన్ని కోళ్లను పెంచాలి అనేది..ఇవి చూడండి ఏం చేశాయో
అందుకే ఫామ్‌లో గిన్ని కోళ్లను పెంచాలి అనేది..ఇవి చూడండి ఏం చేశాయో
బాలిక తలనుంచి అదొరకం వాసన.. హస్పిటల్‌కు తీసుకెళ్లగా..
బాలిక తలనుంచి అదొరకం వాసన.. హస్పిటల్‌కు తీసుకెళ్లగా..
కాస్త పెట్టుబడి పెట్టగలిగితే.. లక్షల సంపాదించే బిజినెస్‌ ఇది!
కాస్త పెట్టుబడి పెట్టగలిగితే.. లక్షల సంపాదించే బిజినెస్‌ ఇది!
బంగ్లాదేశ్ ఎన్నికల చరిత్రలో అనూహ్య మలుపు..!
బంగ్లాదేశ్ ఎన్నికల చరిత్రలో అనూహ్య మలుపు..!
కేవలం రూ.10 లక్షలలోపే 5స్టార్‌ రేటింగ్‌ ఉన్న కార్లు ఇవే..!
కేవలం రూ.10 లక్షలలోపే 5స్టార్‌ రేటింగ్‌ ఉన్న కార్లు ఇవే..!
2027 ప్రపంచకప్ ఆడనున్న రోహిత్ శర్మ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా
2027 ప్రపంచకప్ ఆడనున్న రోహిత్ శర్మ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా
అరవ శ్రీధర్ తీరుపై జనసేన ఎమ్మెల్యేలు ఏమన్నారో తెలుసా..?
అరవ శ్రీధర్ తీరుపై జనసేన ఎమ్మెల్యేలు ఏమన్నారో తెలుసా..?
జియో, ఎయిర్‌టెల్‌లో ఎవరిది పైచేయి..? ట్రాయ్‌ కొత్త నివేదిక!
జియో, ఎయిర్‌టెల్‌లో ఎవరిది పైచేయి..? ట్రాయ్‌ కొత్త నివేదిక!