AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: కాస్త పెట్టుబడి పెట్టగలిగితే.. లక్షల సంపాదించే బిజినెస్‌ ఇది! డిమాండ్‌కు కొదవే లేదు..

ఉద్యోగంతో విసిగి వ్యాపారం చేయాలనుకునే వారికి డెయిరీ ఫామ్ ఒక సువర్ణావకాశం. పాలు, పాల ఉత్పత్తులకు ఉన్న అధిక డిమాండ్‌తో ఇది లక్షలు సంపాదించే లాభదాయక వ్యాపారంగా మారింది. కేవలం రూ.10 లక్షల ప్రారంభ పెట్టుబడితో, 20 గేదెలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

Business Idea: కాస్త పెట్టుబడి పెట్టగలిగితే.. లక్షల సంపాదించే బిజినెస్‌ ఇది! డిమాండ్‌కు కొదవే లేదు..
Indian Currency 7
SN Pasha
|

Updated on: Feb 13, 2026 | 8:30 AM

Share

ఈ ఉద్యోగాలు ఏం చేస్తాం.. గొడ్డు జాకిరీ అని ఫీల్‌ అయ్యే చాలా మందికి ఉండే ఆలోచన ఏంటంటే.. ఒక మంచి బిజినెస్‌ చేయాలని. కానీ అందరికి దగ్గర పెట్టుబడికి పైసలు ఉండవు. అప్పటి వరకు జాబ్‌తో వారి చుట్టు అల్లుకుపోయిన ఖర్చులు, ఫ్యామిల రీజన్స్‌తో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టి రిస్క్‌ చేయలేరు. అయితే రిస్క్‌ అయినా పర్లేదు బిజినెస్‌ చేయాల్సిందే అనే మొండి పట్టుదలతో కొంతమంది ఉంటారు. అలాంటి వారు మీరైతే.. మీ వద్ద కాస్త పెట్టుబడి పెట్టే స్థోమత ఉంటే ఓ సూపర్‌ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

డెయిర్‌ ఫామ్‌ బిజినెస్‌.. చాలా మంది ఇది రైతులు చేసే పాల వ్యాపారం అనుకుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. డెయిరీ ఫామ్‌ అంటే ఇప్పుడు లక్షలు కురిపించే ఓ బంగారు బాతు. సరిగ్గా ప్లాన్‌ చేయాలే కానీ ఇందులో చాలా డబ్బు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనాభాకు పాలు, పాల ఉత్పత్తులు తీర్చడం ఆల్రెడీ ఈ వ్యాపారంలో ఉన్న వారి వల్ల అవ్వడం లేదు. పాలకు, పాల పదార్థాలకు అంత విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ డిమాండ్‌ను కాస్త తీరుస్తూ.. డబ్బు సంపాదించాలంటే డెయిరీ ఫామ్‌ ఇప్పుడు ఓ గోల్డెన్‌ ఆపర్చునిటీ.

అయితే డెయిరీ ఫామ్‌ను మరీ భారీ ఎత్తున కాకుండా ఓ 20 గేదెలతో స్టార్ట్‌ చేయడం మంచిది. అలాగే మీరే పూర్తిగా పని చేయాల్సిన అవసరం లేకుండా బీహార్‌, మహారాష్ట్ర నుంచి ఓ జంటను ఏడాదికి ఇంత అని మాట్లాడుకొని ఫామ్‌లో పనికి పెట్టొచ్చు. వారు నిత్యం అక్కడే ఉండటం వల్ల పని సాఫీగా సాగుతుంది. అయితే ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేసేందుకు షెడ్డు నిర్మాణం, గేదెల కొనుగోలు, దాణా, పని వారికి అంతా కలిపి ఓ రూ.10 లక్షలు ఆరంభ పెట్టుబడిగా అవుతుంది. సొంత భూమి ఉంటే ఓకే.. లేదంటే లీజ్‌కు తీసుకునేందుకు మరి కొంత ఖర్చు అవుతుంది. మరి మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నా, లేదా లోన్‌ తీసుకొని అయినా ఈ బిజినెస్‌ను ప్రారంభించి, అకింతభావంతో కష్టపడి పని చేస్తే మంచి లాభాలు చూడొచ్చు. పైగా ఈ బిజినెస్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సహాయం అందజేస్తాయి. వాటికి సంబంధించి ముద్రా వంటి లోన్‌ స్కీమ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి