AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Farmers: మహారాష్ట్ర-తెలంగాణ ప్రభుత్వాలకు రైతుల సీరియస్ వార్నింగ్.. మూకుమ్మడి ఆత్మహత్య చేసుకుంటామని..

ఆ రైతులకు ఆగ్రహం వచ్చింది.. ఆ ఆగ్రహంతోనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి దారుణంగా..

Maharashtra Farmers: మహారాష్ట్ర-తెలంగాణ ప్రభుత్వాలకు రైతుల సీరియస్ వార్నింగ్.. మూకుమ్మడి ఆత్మహత్య చేసుకుంటామని..
Farmers
Shiva Prajapati
|

Updated on: Oct 08, 2022 | 5:13 PM

Share

ఆ రైతులకు ఆగ్రహం వచ్చింది.. ఆ ఆగ్రహంతోనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నాడు ఒక మాట ఇచ్చి.. నేడు ఒకటి అమలు చేయడం ఏంటంటూ రెండు ప్రభుత్వాల దుమ్ము దులుపుతున్నారు. వారే మేడిగడ్డ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన బాధిత రైతులు.మేడిగడ్డ ముంప పరిహారం విషయంలో తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలకు సిరొంచ మండలంలోని గ్రామాల రైతులు వార్నింగ్ ఇచ్చారు. ముంపు పరిహారంపై రెండు రోజుల్లో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

బ్యారేజీ నిర్మాణ సమయంలో ఇరు రాష్ట్రాల ముంపు రైతులకు ఎకరాకు రూ. 10.5 నుంచి రూ. 15 లక్షల వరకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు 3 లక్షల రూపాయలే చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో మహారాష్ట్ర రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. మరో రెండు రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే సిరొంచ తాలూకాలోని 15 గ్రామాలకు చెందిన ముంపు రైతులమంతా సామూహిక ఆత్మబలిదానాలు, ఆత్మహత్యలకు పాల్పడతామని తేల్చి చెప్పారు. తమ ఆత్మహత్యలకు తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యులవుతారని స్పష్టం చేశారు సిరోంచ తాలుకా రైతులు. మరి ముంపు బాధిత రైతుల అల్టిమేటమ్‌తో తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..