Munugode By Poll: వెంకటరెడ్డి ఆడియో లీక్ పై స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. ఆ ఎమ్మెల్యేలు కూడా తన గెలుపు కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన పార్టీల మధ్య కాక పుట్టిస్తోంది. గెలుపు కోసం ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తుండగా.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి..
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన పార్టీల మధ్య కాక పుట్టిస్తోంది. గెలుపు కోసం ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తుండగా.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి సహకరించాలని కాంగ్రెస్ నేతలను కోరిన ఆడీయో లీక్ కలకం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఆడియో లీక్ పై మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరడంలో తప్పేముందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో తాను కాంగ్రెస్ లో ఉండి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పలువురు టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే తాను గెలవాలని కోరుకుంటున్నారని, తనకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు బీజేపీ కి మద్దతు ఇవ్వాలని, తనను గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. ఉపఎన్నిక వస్తేనే టిఆర్ఎస్ పార్టీకి సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని రాజగోపాల్ రెడ్డి ఎద్దెవా చేశారు.
ఎనిమిది ఏళ్లుగా ప్రాజెక్టుల పేరుమీద, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా తో లక్షల కోట్ల రూపాయలను సీఏం కేసీఆర్ దోచుకున్నారుని ఆరోపించారు. హుజురాబాద్ లో మాదిరిగానే మునుగోడు ప్రజాలు టీఆరెఎస్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు. సీఎం కేసీఆర్ చెప్పే మాటలను ప్రజలు నమ్మడం లేదని, కేసీఆర్ అంటే అసహించుకుంటున్నారని విమర్శించారు. మునుగోడులో బీజేపీ పార్టీ గెలిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం 15 రోజుల్లో పడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు అయ్యారో ఆరోజు నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు. బీజేపీ కి ఓట్లు వేస్తే ఫించను, రైతు బంధు రాదని టిఆర్ఎస్ వాళ్ళు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మునుగోడు లో రాబోయే రోజుల్లో రూ.1000 కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
తన సోదరుడి మాటల్లో తప్పేముంది..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ పై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. హుజురాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ లో ఉండీ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాను ఈటెల రాజేందర్ ను గెలిపించాలని కోరానని చెప్పారు. ఇప్పుడు తన సోదరుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యన్నీ కాపాడాలని చెప్పారని, అందులో ఎమి తప్పు ఉందని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం మంది తాను గెలవాలని కోరుకుంటున్నారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు తనకు నేరుగా కాల్ చేసి ఆ విషయాన్ని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దహనం
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ అభ్యర్థికి సహకరించాలని కోరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీలో ఉంటూ కాంగ్రెస్ కు ద్రోహం చేస్తున్న వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..