Munugode By Poll: మునుగోడు బైపోల్స్‌లో రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వండి.. కాంగ్రెస్ నేతకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ లీక్

హస్తం పార్టీలో ఉంటూ పార్టీ నాయకుడికి ఫోన్ చేసి తన సోదరుడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహకరించాలని, మీరంతా తమ కుటుంబ సభ్యులంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మునుగోడు లో బీజేపీ..

Munugode By Poll: మునుగోడు బైపోల్స్‌లో రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వండి.. కాంగ్రెస్ నేతకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ లీక్
Komatireddy Venkatreddy
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 21, 2022 | 3:05 PM

తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ఉప ఎన్నికల గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతూ.. ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. టీఆర్ ఎస్, బీజేపీ పోటాపోటీగా వ్యూహా, ప్రతి వ్యూహాలను రూపొందిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే… కాంగ్రెస్ పార్టీలో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హస్తం పార్టీ నాయకులకు ఫోన్ చేసి మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహకరించాలని కోరిన ఆడియో ఒకటి లీకైంది. ఈ  ఆడియో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున ప్రచారం చేస్తారని హస్తం పార్టీ నాయకులు భావించ నప్పటికి.. అతడితో ప్రచారం చేయించాలనే ప్రయత్నం మాత్రం చేశారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆయన ఓ కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడిన ఆడియో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. మరోవైపు సడన్ గా కుటుంబంతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా ట్రిప్ కు వెళ్లడం కూడా సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని, తమ ప్రభుత్వం వచ్చాక అందరినీ తాను చూసుకుంటానని భరోసా ఇస్తూ మాట్లాడారు. అదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికలో పార్టీలకు అతీతంగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సహకరించాలని కోరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

హస్తం పార్టీలో ఉంటూ పార్టీ నాయకుడికి ఫోన్ చేసి తన సోదరుడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహకరించాలని, మీరంతా తమ కుటుంబ సభ్యులంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మునుగోడు లో బీజేపీ అబ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహకరించాలని కోరడం ద్వారా పరోక్షంగా ఆయనకు ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. అలాగే ఈ దెబ్బ తో పీసీసీ ప్రెసిడెంట్ తానే అవుతా అంటూ ఫోన్ కాల్ లో సంభాషించారు. పార్టీలను చూడొద్దని రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలన్నారు. ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు. చచ్చినా, బతికిన రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారని ఫోన్ కాల్ లో సంభాషించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

ఇవి కూడా చదవండి

ఫ్యామిలీతో ఆస్ట్రేలియా టూర్..

కాంగ్రెస్ పార్టీ లో స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో కలకలం రేపగా, దానిపై స్పందించడానికి ఆయన అందుబాటులో లేరు. గత రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పది రోజుల హాలిడే ట్రిప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లారు ఆయన. పార్టీ నాయకులైతే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

వెంకట్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ అభ్యర్థికి మునుగోడు ఉప ఎన్నికలో సహకరించాలని కోరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. లీకైన ఆడియా పై ఏఐసీసీ కార్యదర్శులు ఆరా తీస్తున్నారు. ఎవరితో మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు అనే వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే ఇంకా ఎవరైనా కాంగ్రెస్ నాయకులతో ఈ విధంగా సంభాషించారా అనే దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై హై కమాండ్ కి పిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాగూర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..