Telangana: TRSలోకి శ్రవణ్‌, స్వామిగౌడ్.. వారు మళ్లీ రావడం ఆనందంగా ఉందన్న కేటీఆర్

Ram Naramaneni

|

Updated on: Oct 21, 2022 | 5:09 PM

బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ఆపరేషన్‌ ఆకర్ష్‌ రాజకీయం ఆసక్తిగా సాగుతోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో ఈ గేమ్‌ మొదలైంది. గులాబీకి గుడ్‌బై చెప్పి బూర నర్సయ్య గౌడ్‌ కాషాయ కండువా కప్పుకోవడంతో టీఆర్‌ఎస్‌ కూడా అలర్ట్‌ అయింది. పాత నేతలకు టచ్‌లోకి వెళ్లింది. బీజేపీలోకి వెళ్లిన వారిని మళ్లీ చేర్చుకోవడం ద్వారా గట్టి దెబ్బకొట్టాలని ప్లాన్‌ చూస్తోంది.

దాసోజు శ్రవణ్‌, స్వామి గౌడ్‌ తిరిగి TRSలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందని TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR అన్నారు. ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన వారు తిరిగి రావడంతో ఆనందించదగ్గ పరిణామమని KTR తెలిపారు. వారితో గతంలో ఉన్న అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని అన్నారు. ఇద్దరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి KTR ఆహ్వానించారు. ఏ ఆశయాల కోసమైతే బీజేపీలో చేరామో అవేవి నెరవేరలేదని TRSలో మళ్లీ చేరిన శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. ఇప్పడు TRSను BRSగా మార్చడంతో తమ ఆకాంక్షలు నెరవేరుతాయనే భావిస్తున్నానని స్వామి గౌడ్‌ అన్నారు. TRSలోకి తనను తిరిగి ఆహ్వానించినందుకు KCR, KTRకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Published on: Oct 21, 2022 05:00 PM