Congress: బీఆర్ఎస్‎ను వీడి కాంగ్రెస్ గూటికి ఆ నేతలు.. అసలు కారణం ఇదే

మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 13 మంది కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా.. ప్రస్తుతం 24 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు. అటు బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 12కు పడిపోయింది.

Congress: బీఆర్ఎస్‎ను వీడి కాంగ్రెస్ గూటికి ఆ నేతలు.. అసలు కారణం ఇదే
BRS Vs Congress
Follow us

|

Updated on: Dec 15, 2023 | 7:51 AM

మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 13 మంది కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా.. ప్రస్తుతం 24 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు. అటు బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 12కు పడిపోయింది. దీంతో మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఒకవేల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మున్సిపల్ చైర్మన్ రాజయ్యతో పాటు వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్‌కు పదవి గండం తప్పదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో.. ఆ పార్టీలోకి జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అభివృద్ధి కోసమే వాళ్లంతా పార్టీలోకి వస్తున్నట్టు చెప్తున్నారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..