Professor Haragopal: ప్రొఫెసర్ హరగోపాల్‌పై UAPA కేసు ఎత్తివేత.. ములుగు ఎస్పీ సంచలన ప్రకటన
ప్రొఫెసర్ హరగోపాల్‌పై UAPA కేసు విషయంలో ములుగు ఎస్పీ గౌష్ ఆలం సంచలన ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరగోపాల్‌తో పాటు మరో ఆరుగురిపై ఉపా కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్, పద్మజాషా, అడ్వొకేట్ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ప్రొఫెసర్ హరగోపాల్‌పై UAPA కేసు విషయంలో ములుగు ఎస్పీ గౌష్ ఆలం సంచలన ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరగోపాల్‌తో పాటు మరో ఆరుగురిపై ఉపా కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్, పద్మజాషా, అడ్వొకేట్ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే దివంగత జడ్జి సురేశ్‌పై కేసు ఎత్తివేశారు. అయితే కేసులు ఎత్తివేసినా న్యాయపరంగా కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్లు ములుగు ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2002 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్‌లో చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద హరగోపాల్‌పై కేసు నమోదు చేశారు. యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద హరగోపాల్ తో పాటు 152 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి.
దీంతో ఇవాళ (జూన్ 17) హరగోపాల్ కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని డిజీపీని ఆదేశించారు. ఈ క్రమంలో కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చిన గంటల వ్యవధిలోనే హరగోపాల్ తదితరులపై ఉపా కేసులు ఎత్తివేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
