AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ 3 స్థానాల్లో ఏదైనా రెడీ అట.. ఏకంగా మంత్రులపైనే సవాల్

కర్నాటక ఫలితాలతో ఊపుమీదున్న టి.కాంగ్రెస్‌ నేతలు..దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు నేతల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో నేతలు పర్యటనలు చేస్తూ కేడర్‌ని సమాయత్తం చేస్తున్నారు.

Telangana: ఆ 3 స్థానాల్లో ఏదైనా రెడీ అట.. ఏకంగా మంత్రులపైనే సవాల్
Kichannagari Lakshma Reddy
Ram Naramaneni
|

Updated on: Jun 17, 2023 | 9:47 PM

Share

రంగారెడ్డి జిల్లాలో మంచి పట్టు సంపాదించిన నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్‌). ఎన్నికల సమయం దగ్గరపడటం.. కర్నాటక ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ రావడంతో..  కేఎల్‌ఆర్‌ స్పీడు పెంచారు. ప్రస్తుతం ఇద్దరు మంత్రులు నేతృత్వం వహిస్తున్న స్థానాలపై ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల నుంచి రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారట. ఆ రెండింటీలో అన్ని సమీకరణాలు లెక్కగట్టి.. బలమైన స్థానంలో ఆయన్ని రంగంలోకి దింపేందుకు అధిష్ఠానం కసరత్తు మొదలు పెట్టిందట. ఈ క్రమంలోనే ఆయా మంత్రుల వైపల్యాలను జనంలోకి తీసుకెళ్లుందుకు విసృతంగా ప్రయత్నిస్తున్నారు ఈ మాజీ ఎమ్మెల్యే.

ఇంతకూ  కెఎల్‌ఆర్‌ ఫోకస్ పెట్టిన ఆయా ఇద్దరు మంత్రులు ఎవరంటే.. సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి. అంతే కాదండోయ్.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై తాండూరు నుంచి పోటీ చేసేందుకు కూడా తాను సిద్దమని కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి హైకమాండ్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇలా మొత్తం 3 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి వేగంగా తన పని చేసుకుపోతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీపై విమర్శల తాకిడి పెంచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు.

కాగా ఎన్నికల నోటిఫికేషన్‌‌కు ముందే చాలావరకు దీటైన అభ్యర్థులను ఫైనల్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఆయా క్యాండిడేట్స్‌కు ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ధోరణి దక్కింది. అంతేకాదు చేరికల జోష్ పెరిగింది. మరి ఈ పాజిటివ్ బజ్‌ను కాంగ్రెస్ ఎంతమేర వినియోగించుకుంటుంది అన్నది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..