Hyderabad: హైదరాబాద్‌లో ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీపై బండి సంజయ్, రాజాసింగ్ సంచలన ఆరోపణలు..
హైదరాబాద్‌లో ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన బండి..

హైదరాబాద్‌లో ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన బండి.. వేలకు వేల నకిలీ ధృవీకరణ పత్రాలు ఇస్తుంటే జీహెచ్‌ఎంసీ కనీసం రివ్యూ నిర్వహించదా అని ప్రశ్నించారాు. ప్రభుత్వం వైపు నుంచి జీహెచ్‌ఎంసీపై నిఘా కొరవడిందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో ఉన్నదంతా దళారీ వ్యవస్థే అని, డబ్బు విసిరేస్తే ఏ పని అయినా జరుగుతోందన్నారు బండి. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని, పొరుగుదేశాల నుంచి వచ్చి ఫేక్ సర్టిఫికెట్లతో ఇక్కడ ఉంటున్నారని ఆరోపించారు. కొందరు కార్పోరేటర్ల ఇష్టా రాజ్యం నడుస్తోందని, రివ్యూలు, ప్రక్షాళన లేకుండా జీహెచ్‌ఎంసీ నడుస్తోందని ఆరోపించారు రాష్ట్ర కమల దళపతి. జీహెచ్‌ఎంసీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
రాజాసింగ్ ఘాటు రియాక్షన్..
నకిలీ జనన, మరణ పత్రాలపై రాజాసింగ్ అయితే ఏకంగా టెర్రరిస్ట్ యాక్టివినీనే అనేశారు. వేలకు వేలు ఓల్డ్ సిటీలో నకిలీ సర్టిఫికెట్లు పుట్టడంపై MIM పాత్రను అనుమానం వ్యక్తం చేశారు. షాదీముబారక్ స్కీమ్ కోసం జరిగిన స్కామ్ అని ఆరోపించారు. రోహింగ్యాలకూ ఫేక్ సర్టిఫికెట్లతో మేలు చేసే పన్నాగం ఇది అని ఆరోపించారు రాజాసింగ్. పాక్, బంగ్లాదేశీయులకూ నకిలీ సర్టిఫికెట్లతో ఆశ్రయం ఇస్తున్నారని అన్నారు. ఇందులో టెర్రరిస్ట్‌లు కూడా ఉండొచ్చని రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వాన్ని హెచ్చిరించినా పట్టుంచుకోలేదన్న రాజాసింగ్.. ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు.
డీసీపీ చైతన్య వార్నింగ్..
ఫేక్ సర్టిఫికెట్లపై గతంలోనే మొఘల్పురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పట్లో 243 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో కిద్మత్ మీ సేవా సెంటర్‌కు సంబంధించి నలుగుర్ని అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత కనీసం రివ్యూ చేసి ఉన్నా.. ఇప్పుడు వేలకు వేల నకిలీ ధృవపత్రాలు వెలుగులోకి వచ్చేవి కాదంటున్నారు. అప్పట్లో మొగల్‌పురా స్టేషన్‌లో జరిగిన రెయిడ్స్, జరిగిన ప్రక్రియపై డీసీపీ చైతన్య వార్నింగ్ కూడా ఇచ్చారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..