AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavitha – KCR: మై డియర్ డాడీ.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ కవిత సంచలన లేఖ..

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ఆమె కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. కొన్ని పాజిటివ్ విషయాలు చెబుతూనే పలు నెగిటివ్ అంశాలను కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు కవిత. పార్టీ లీడర్స్‌కి యాక్సెస్‌ ఇవ్వడం లేదని పేర్కొన్న కవిత.. వరంగల్ సభ స్పీచ్‌లో మరింత పంచ్‌ ఉండాల్సిందని లేఖలో ప్రస్తావించారు.

Kavitha - KCR: మై డియర్ డాడీ.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ కవిత సంచలన లేఖ..
Kavitha's Sensational Letter to KCR
Shaik Madar Saheb
|

Updated on: May 22, 2025 | 7:39 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ఆమె కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. కొన్ని పాజిటివ్ విషయాలు చెబుతూనే పలు నెగిటివ్ అంశాలను కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు కవిత. పార్టీ లీడర్స్‌కి యాక్సెస్‌ ఇవ్వడం లేదని పేర్కొన్న కవిత.. వరంగల్ సభ స్పీచ్‌లో మరింత పంచ్‌ ఉండాల్సిందని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ తల్లి విగ్రహం, గీతం గురించి మాట్లాడతారని అంతా అనుకున్నారని.. కానీ అలా జరగలేదన్నారు. ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదని.. వక్ఫ్‌ బిల్లు మీద కేసీఆర్ మాట్లాడతారని జనం భావించారని లేఖలో పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారని.. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సభలో ప్రస్తావించలేదని కవిత వివరించారు. వరంగల్ సభ ఏర్పాట్ల బాధ్యతలను పాత ఇన్‌ఛార్జ్‌లకే అప్పగించారని.. స్థానిక సంస్థల బీ ఫామ్‌లు మళ్లీ మా దగ్గరకే వస్తాయని పాత ఇన్‌ఛార్జ్‌లు చెప్పుకుంటున్నారని కవిత లేఖలో ప్రస్తావించారు. ధూమ్ ధాం కళాకారులు కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయారని తెలిపారు.

ఇక వరంగల్ సభలో 2001 నుంచి పార్టీలో ఉన్న వారికి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని కవిత అభిప్రాయపడ్డారు. ఇక సభలో ఏర్పాటు చేసిన ధూమ్ ధామ్ కార్యక్రమం కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయిందని అభిప్రాయడ్డారు.

ఇక బీజేపీ మీద కేసీఆర్ కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటాన్ని కూడా కవిత కీలకంగా ప్రస్తావించారు. వారిని తక్కువగా టార్గెట్ చేయడం వల్ల భవిష్యత్తుల్లో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయని అభిప్రాయపడ్డారు. బీజేపీ పెట్టిన కేసులు కారణంగా తాను కూడా బాగా ఇబ్బందిపడ్డానని చెప్పారు.

పాజిటివ్ అంశాలు ఇవే..

BRS సభతో క్యాడర్ నైతికంగా బలపడిందని.. ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా నచ్చిందని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పిన తీరు సూపర్‌ .. పహెల్గం అమరలకు నివాళి -మౌనం బాగుందని వివరించారు. రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టక పోవడం చాలా మందికి నచ్చిన అంశంగా మారిందన్నారు. సీఎం తిడుతున్నా మీరు హుందాగా ఉన్నారని.. పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ కూడా బాగుందని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..