ఎండాకాలం పోయినట్టే..! అరేబియా మహా సముద్రంలో అల్పపీడనం.. అతి భారీ వర్షాలు..
శుక్ర, శని వారాల్లో కూడా రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగగా.. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నట్టు తెలియజేసింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈనెల 26, 27న ఏపీలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రాగల మూడు రోజులలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

రుతుపవనాల రాక తర్వాత అరేబియా సముద్రంలో ఈ సీజన్‌లో తొలి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఉత్తర కర్ణాటక-గోవా తీరంలో తూర్పు-మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. తరువాత ఉత్తర దిశగా కదులుతున్న అల్పపీడనం రాబోయే 36 గంటల్లో తీవ్ర అల్పపీడన ప్రాంతంగా బలపడే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా మహా సముద్రంలోని మిడిల్ ఈస్ట్, సౌత్ కొంకణ్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఈ కారణంగా రానున్న 36 గంటల్లో కేరళ, కర్ణాటక, గోవాలో అతి భారీ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అలాగే మే 27న బంగాళాఖాతంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఇక గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. గంటకు 50 నుంచి 60 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
శుక్ర, శని వారాల్లో కూడా రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగగా.. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నట్టు తెలియజేసింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈనెల 26, 27న ఏపీలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రాగల మూడు రోజులలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..