Jaishankar: ఎక్కడున్న వదిలే ప్రసక్తే లేదు.. అక్కడికి వచ్చి మరీ లేపేస్తాం.. ఉగ్రవాదులకు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఉగ్రవాదుల టార్గెట్‌గా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్ దృడ సంకల్పంతో ఉందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి లాంటి మరో ఘటన జరిగితే భారత్ చూస్తూ ఊరుకోదన్నారు. అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ సిందూర్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఒక వేళ ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ఉన్నా వదిలిపెట్టమని.. వారు ఎక్కడుంటే అక్కడికెళ్లి మట్టుపెడతామని హెచ్చరించారు.

నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, దాని తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందా అని వారు అడిన ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇస్తూ.. భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహిందని. పహల్గామ్ లాంటి దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాదలును మట్టుపెట్టాలనే లక్ష్యంతోనే భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టిందని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు ఒక నిర్ధిష్టమైన లక్ష్యం ఉందని.. పహల్గాం లాంటి ఉగ్రదాడులు జరిగితే వారిని మట్టుబెట్టేందుకు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉన్న వదిలిపెట్టమని.. వారు ఎక్కడ దాకున్న వారు ఉన్న చోటుకు వెళ్లి మరీ అంతమెందిస్తామని ఆయన అన్నారు.
తర్వాత పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి జైశంకర్ మాట్లాడుతూ, “ఇటీవల భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి దాని కారణం భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి. పచ్చని పర్యావణాన్ని ఆస్వాధించేందుకు వచ్చిన 26 మంది అమాయక పర్యాటకులను మతం అడిగి మరి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇది భారత దేశాన్ని తీవ్రంగా కలిచి వేసింది. అంతే కాకుండా కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన పర్యాటకానికి హాని కలిగించింది అని ఆయన అన్నారు. మతపరమైన విభేదాలను సృష్టించే ఉద్దేశ్యంతో ఈ దాడి జరిగిందన్నారు.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా 7 తెల్లవారుజామున భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టిందన్నారు.ఈ ఆపరేషన్‌తో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ (PoJK) లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన తెలిపారు. దీని ఫలితంగా జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కరే-తోయిబా (LeT) హిజ్బుల్ ముజాహిదీన్ (HM) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దాడి తరువాత, పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి జమ్మూకాశ్మీర్ లలో సరిహద్దుల ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు పాల్పడిందని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్ తర్వాత పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడి చేసి పాక్‌లోని ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసిందన్నారు. ఇక ఆ తర్వాత మే 10న, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పరిస్థితులు సద్దుమణిగాయని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




