AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తం, నీళ్లు ఒకేసారి ప్రవహించడం అసాధ్యం.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..

పాకిస్తాన్‌తో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పైనే చర్చలు ఉంటాయని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. చైనా , పాకిస్తాన్‌ , ఆఫ్గనిస్తాన్‌ మధ్య CPEC కారిడార్‌ ఒప్పందంతో భారత్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం స్పష్టం చేసింది. తాలిబన్లతో స్నేహం కొనసాగిస్తామని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

రక్తం, నీళ్లు ఒకేసారి ప్రవహించడం అసాధ్యం.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..
India Pakistan Tensions
Anand T
|

Updated on: May 22, 2025 | 10:08 PM

Share

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌పై వెనక్కి తగ్గేదే లేదని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా చైనా చేస్తున్న కుట్రలను చూసి భారత్‌ ఏమాత్రం భారత్‌ బెదరడం లేదు. POK విషయంలో మరింత దూకుడుగా వెళ్లాలన్న ఆలోచనతో భారత్‌ ఉంది. ప్రధాని మోదీ ఇదే సందేశాన్ని పాకిస్తాన్‌కు మరోసారి పంపించారు. చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను ఆఫ్గనిస్తాన్‌ వరకు పొడిగిస్తూ చైనా చేసిన కుట్రను తిప్పికొట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది.

నిన్న మొన్నటి దాకా బద్దశత్రువులుగా ఉన్న తాలిబన్లను , పాకిస్తాన్‌ను ఏకం చేసి గొప్పగా ఫీలవుతోంది చైనా. అయితే ఈ కుట్రను తిప్పికొట్టేందుకు కేంద్రం వ్యూహాన్ని రచిస్తోంది. పాక్‌ ఆక్రమిక కశ్మీర్‌పై మరింత ఫోకస్‌ పెంచాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు ఉండవన్నారు మోదీ. ఒకవేళ చర్చలు జరిగితే కేవలం పీవోకే మీదే జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఏ శక్తి ఈ విషయంలో మనల్ని ఆపలేదని స్పష్టం చేశారు. పాక్‌ ఆక్రమిక కశ్మీర్‌పై తన వైఖరిని మోదీ మరోసారి ప్రపంచానికి వెల్లడించారు.

రక్తం, నీళ్లు ఒకేసారి ప్రవహించడం అసాధ్యం

భారత విదేశాంగశాఖ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. రక్తం, నీళ్లు ఒకేసారి ప్రవహించడం అసాధ్యమని తెలిపింది. ఉగ్రవాదం , చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించింది. పాకిస్తాన్‌తో POKపై మాత్రం చర్చలు జరపడానికి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించింది. పాకిస్తాన్‌కు మద్దతివ్వడం మానుకోవాలని తుర్కియేకు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణ్‌దీర్‌ జైస్వాల్‌ విజ్ఞప్తి చేశారు.

‘‘పాకిస్తాన్‌తో జమ్ముకశ్మీర్‌పై ద్వైపాక్షిక చర్చలు మాత్రమే ఉంటాయి. పాకిస్తాన్‌ ఆక్రమించిన భారత భూభాగం మీదే చర్చలు ఉంటాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు సింధు జలాల ఒప్పందం రద్దు ఉంటుంది. రక్తం, నీళ్లు ఒకేసారి ప్రవహించడం అసాధ్యమని ప్రధాని మోదీ చెప్పారు. ట్రేడ్‌ , టెర్రరిజం కూడా ఒకేసారి సాధ్యం కాదు.’’ అంటూ విదేశాంగశాఖ ప్రతినిధి రణదీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు.

ఆఫ్గన్‌ తాలిబన్‌ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. తాలిబన్‌ ప్రభుత్వంతో మరోసారి మాట్లాడామని , రెండు దేశాల మధ్య స్నేహం విషయంలో అపోహలు అక్కర్లేదన్నారు రణదీర్‌ జైస్వాల్‌. తాలిబన్లు కూడా భారత్‌తో స్నేహం కొనసాగిస్తామని తెలిపారని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..